Site icon NTV Telugu

Vani Viswanath: నగరిలో బరిలోకి దిగిన మరో సినీ స్టార్.. రోజాపై పోటీకి సై..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా ఉంటుంది.. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్‌ బ్రాండ్‌ ఆర్కే రోజా.. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు ఆర్కే రోజా. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు ఎన్నో సార్లు గుప్పుమన్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేయడం చర్చగా మారింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోరు ఆసక్తిగా మారేలా కనిపిస్తోంది. ఎంతకంటే..? ఇప్పుడు ఇంకో స్టార్‌ నగరిలో దిగిపోయారు.. తాజాగా నగరిలో పర్యటించారు సినీ నటి వాణీ విశ్వనాథ్.. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారామె.

Read Also: Goa Results: స్వల్ప ఓట్లతో సీఎం సావంత్‌ విజయం.. ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా..!

రానున్న ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు వాణీవిశ్వనాథ్‌.. ఈ నియోజకవర్గంలో తనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిపిన ఆమె.. వారి కోరిక మేరకు నగరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం ఖాయమని తేల్చేసిన ఆమె.. అయితే, ఏ పార్టీ నుంచి బరిలో దిగుతాననేది మాత్రం చెప్పలేను అన్నారు.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను అని.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. దీంతో.. మరోసారి నగరి అసెంబ్లీ సీటు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో చూడాలి.

Exit mobile version