Site icon NTV Telugu

Vangalapudi Anitha: గోరంట్ల మాధవ్ తప్పు చేసిందే కాక.. ఛాలెంజ్ విసురుతాడా?

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ మహిళా జేఏసీ సభ్యులు శుక్రవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వ వైఖరి ఉందని ఆమె ఆరోపించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎంపీ మాధవ్ ముమ్మాటికీ తప్పు చేశాడని.. ఇంకా చేస్తూనే ఉన్నాడని వంగలపూడి అనిత అన్నారు. తప్పు చేసిందే కాకుండా ఎంపీ మాధవ్ కెమెరా ముందు కూర్చుని ఛాలెంజ్ విసురుతాడా అని ఆమె మండిపడ్డారు.

అటు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై గవర్నర్ బాధపడ్డారని వంగలపూడి అనిత అన్నారు. ఎస్పీ ఫకీరప్ప శాటిలైట్ టెక్నికల్ ద్వారా క్రిమినల్స్‌ను పట్టుకోవటంలో సిద్ధహస్తుడు అని.. కానీ అలాంటి వ్యక్తి ఒరిజినల్ వీడియో ఉంటేనే కానీ చెప్పలేం అనటం అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. ఒరిజినల్ వీడియో అంటూ డర్టీ ఎంపీని తప్పించడానికి ప్రయత్నించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల చేతిలో ఎస్పీ ఫకీరప్ప కీలుబొమ్మగా మారిపోయారా లేదా ఒత్తిళ్ళకు తలొగ్గారా అన్న సందేహం కలుగుతుందన్నారు. త్వరలో మహిళా జేఏసీ తరఫున ఢిల్లీ వెళ్తామని.. అక్కడ లోక్ సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాధవ్ వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు. ఎంపీ మాధవ్ బర్తరఫ్ అయ్యే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Exit mobile version