Vangalapudi Anitha: గోరంట్ల మాధవ్ తప్పు చేసిందే కాక.. ఛాలెంజ్ విసురుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ మహిళా జేఏసీ సభ్యులు శుక్రవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వ వైఖరి ఉందని ఆమె ఆరోపించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎంపీ మాధవ్ ముమ్మాటికీ తప్పు చేశాడని.. ఇంకా చేస్తూనే ఉన్నాడని వంగలపూడి అనిత అన్నారు. తప్పు చేసిందే కాకుండా ఎంపీ మాధవ్ కెమెరా ముందు కూర్చుని ఛాలెంజ్ విసురుతాడా అని ఆమె మండిపడ్డారు.
అటు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై గవర్నర్ బాధపడ్డారని వంగలపూడి అనిత అన్నారు. ఎస్పీ ఫకీరప్ప శాటిలైట్ టెక్నికల్ ద్వారా క్రిమినల్స్‌ను పట్టుకోవటంలో సిద్ధహస్తుడు అని.. కానీ అలాంటి వ్యక్తి ఒరిజినల్ వీడియో ఉంటేనే కానీ చెప్పలేం అనటం అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. ఒరిజినల్ వీడియో అంటూ డర్టీ ఎంపీని తప్పించడానికి ప్రయత్నించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల చేతిలో ఎస్పీ ఫకీరప్ప కీలుబొమ్మగా మారిపోయారా లేదా ఒత్తిళ్ళకు తలొగ్గారా అన్న సందేహం కలుగుతుందన్నారు. త్వరలో మహిళా జేఏసీ తరఫున ఢిల్లీ వెళ్తామని.. అక్కడ లోక్ సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాధవ్ వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు. ఎంపీ మాధవ్ బర్తరఫ్ అయ్యే వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గారు సాంకేతిక పరిజ్ఞానం లో నిష్ణాతులైన అధికారి. తన కెరీర్లోనే ఎన్నో ఆర్థిక నేరాలను, హత్య కేసులను, సైబర్ నేరాలను టవర్ లోకేషన్ల ద్వారా, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అవలీలగా చేదించిన ఆయన నేడు ఒక సాధారణ ఓపెన్ అండ్ షట్ కేసులో నిస్సహాయంగా ఒరిజినల్ వీడియో, 1/2
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 11, 2022
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!