NTV Telugu Site icon

TDP vs YCP : జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వంగలపూడి అనిత..

TDP Former MLA Vangalapudi Anitha Made Sensational Comments on CM Jagan.

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఏపీలో వైఎస్‌ వివేకా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం కోసం తన సొంత బాబాయ్ ని సైతం హతమార్చిన చరిత్ర ఆయనిదే అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎన్ని హత్యలు చేస్తాడో మీరే ఉహించుకోవాలని ఆమె వ్యాఖ్యనించారు. ఎదుటి వారిని ఎదిరించాలంటే మనం నీతి గా ఉండాలని ఆమె అన్నారు. జగన్‌ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది ప్రజలు చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.