వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.
హోంమంత్రి సుచరిత నిస్సహాయ మంత్రి అని, గన్ మ్యాన్ ల కోసమే సచరితకు హోం మంత్రి పదవి ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని ఆమె మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చిడంలో విఫలమయ్యారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారని ఆమె వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుడ్డి చెబుతారని, ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజలు ఎందుకు వైసీపీకి ఓట్లు వేశామా అని బాధపడుతున్నారని ఆమె అన్నారు.