NTV Telugu Site icon

AP Deputy CM: పిఠాపురంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి..

Pawan

Pawan

AP Deputy CM: ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.. కానీ, ఆచరణలో అనుకున్నస్థాయిలో మాత్రం ముందడుగు పడడం లేదు.. అయితే, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని ఆకుల కప్పులు, తాటాకు బుట్టలలో వాడాలి అని పేర్కొన్నారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురంలోని ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

Read Also: Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్‌ గంభీర్‌

ఇక, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందొచ్చు అనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు తగలబెట్టడం వల్ల క్లోరో ఫ్లోరో కార్పన్ లు వెలువడి పర్యావరణం కాలుష్యం అవుతుందన్నారు. ఇప్పటికే, నియోజకవర్గంలో ప్లాస్టిక్ వినియోగించొద్దు అని ప్రజలకు అవగహన కల్పిస్తున్నారు.