Site icon NTV Telugu

Crime News: తెనాలిలో దారుణం.. ‘ఉప్పెన’ తరహా ఘటన రిపీట్

Tenali Crime Scene

Tenali Crime Scene

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఐతవరంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో రామచంద్రబాబు అనే వ్యక్తిపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు తెనాలి మండలం ఐతవరంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో సదరు మహిళ కుమార్తె రామచంద్రారెడ్డి మర్మాంగాలు కోసేసింది.

సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి డాబాపై రామచంద్రారెడ్డి నిద్రిస్తున్న సమయంలో తొలుత విచక్షణారహితంగా దాడి చేసింది. తన తల్లితో పడుకుని ఉన్న సమయంలో బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసివేసింది. దీంతో బాధితులు పెద్దపెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. వెంటనే రామచంద్రారెడ్డిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి స్వస్థలం చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం అని పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Police Cruelty: నేలకొండపల్లిలో ఖాకీల ఓవరాక్షన్

Exit mobile version