Site icon NTV Telugu

Umamaheshwari Case: పోలీసులకు చేరిన పోస్ట్ మార్టం నివేదిక

Uma Maheshwari 1

Uma Maheshwari 1

Umamaheshwari Case తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం నివేదిక పోలీసులకు చేరింది. ఉస్మానియా మార్చురీ నుంచి కంఠమనేని ఉమా మహేశ్వరి పోస్టు మార్టం నివేదిక ను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్యులు. ఉమా మహేశ్వరి సూసైడ్ కి పాల్పడినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు నిర్దారించారు. ఉమా మహేశ్వరి హ్యాంగ్ తనకు తాను ఉరి వేసుకుని చనిపోయినట్టు పి ఎం ఈ రిపోర్ట్.లో వుంది.

ఉమామహేశ్వరి మెడ భాగంలో త్రోట్ స్వర పేటిక బ్రేక్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1 న తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందింది స్వర్గీయ ఎన్టీఆర్ చిన్నకూతురు కంఠమనేని ఉమామహేశ్వరి. జుబ్లిహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్య బృందం పి ఎం ఈ రిపోర్ట్ ను పోలీసులకు అందజేశారు.

తన తల్లి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో తన తండ్రితో పాటు.. తన భర్త కూడా ఉన్నట్లు ఉమామహేశ్వరి కూతురు దీక్షిత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. భువనేశ్వరి మాజీ సీఎం చంద్రబాబు భార్య కాగా, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య, ఎన్టీఆర్ మరో కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరి. తన తల్లి ఆత్మహత్యపై దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఉమామహేశ్వరి ఆత్మహత్యపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది.సోమవారం మరణించిన ఉమామహేశ్వరికి బుధవారం జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తిచేసిన సంగతి తెలిసిందే.

Umamaheshwari Case: పోలీసులకు చేరిన పోస్ట్ మార్టం నివేదిక

Exit mobile version