NTV Telugu Site icon

Marriage of two women: ఆయనకు విడాకులు.. ఆమెను పెళ్లి చేసుకుంది.. కానీ, మరో ట్విస్ట్..!

Marriage Of Two Women

Marriage Of Two Women

ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు మహిళల మధ్య కూడా ప్రేమలు ఉంటాయి.. కానీ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకునే ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. సమాజం ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుంటూ అంగీకరించదు.. అయితే, కడప జిల్లాలో ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడితో పెళ్లి జరిగిన తర్వాత.. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు.. ఈ నేపథ్యంలో.. మరో యువతితో స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది వ్యవహారం..

Read Also: Nara Lokesh: లోకేష్‌ కీలక సూచనలు.. అధ్యయనానికి టీడీపీ కమిటీ..

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు.. పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. దీంతో.. దూరంగా ఉంటున్నారు.. ఇదే సమయంలో.. సదరు మహిళలకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్‌ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారి తీసింది.. అది ఎంత వరకు వెళ్లిందంటే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతవరకు వెళ్లింది.. దీంతో ఇద్దరు మహిళలలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్లి.. శనివారం రోజు పెళ్లి చేసుకున్నారు.. ఓ మూడు రోజుల తర్వాత అంటే మంగళవారం తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు.. వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. ఇద్దరు యువతులే కావడంతో షాక్‌ తిన్న పోలీసులు.. ఆ తర్వాత ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి.. ఇళ్లకు పంపించారు.