Cock fight: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్ అయ్యేది..
నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు వెళ్లాడు పద్మారావు అనే యువకుడు.. అయితే, కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకెళ్లాయి.. ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది.. కోడికి కట్టిన కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లిపోయింది.. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో పద్మారావు అక్కడికక్కడే కన్నుమూశాడు.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రికి వచ్చేలోగానే పద్మారావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఇక, కిర్లంపూడి మండలం వేలంకలో మరో ఘటన చోటు చేసుకుంది.. గండే సురేష్ అనే వ్యక్తి కోడి పందాల దగ్గరకు వెళ్లాడు.. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు విడిచాడు..
ఇక, సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.. క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడ పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను సైతం పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. అయితే.. కోడిపందాలు, గుండాట ఆడే వారిపై రెండు రోజుల్లో 97 కేసులు నమోదు చేశామని చెబుతున్నారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. 210 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 132 పందెం కోళ్లు, 133 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు.. 49 గుండాట ఆడే బోర్డులను,1,09,355 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు వెల్లడించారు.