Site icon NTV Telugu

goutham reddy death: ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తెలిపారు. ఉదయం 7.45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని… కార్డియాక్ అరెస్టు రావడం వల్ల ఊపిరి తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. 90 నిమిషాల పాటు CPR చేశామని… అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్‌పై ఉంచామని.. అయినా ఆయన ప్రాణాలు దక్కలేదని ప్రకటించారు. సోమవారం ఉదయం 9:16 గంటలకు గౌతమ్‌రెడ్డి మరణించారని వారు తెలిపారు.

Exit mobile version