Site icon NTV Telugu

Twitter War: అయ్యన్న తూటాలు.. విజయసాయి కౌంటర్లు

Ayyanna Vs Vijayasai

Ayyanna Vs Vijayasai

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి ఎలా వేడెక్కుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విటర్ వార్ మొదలైంది.

తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తాను దేవుణ్ణి ప్రార్థించానన్నారు. తమని రక్షించడంతో పాటు ‘నిన్ను నువ్వు కూడా కాపాడుకో’ అని తాను శ్రీవారిని వేడుకున్నానన్నారు. ఎందుకంటే.. ఆలయంతో ట్రస్టు పేరిట నిలువుదోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒక్కొక్కరికి శ్రీవారి టికెట్ రూ. 10,500 కాగా.. తాను రూ. 75,000 కట్టానన్నారు. అందులో శ్రీవారికి వెళ్ళింది రూ. 3,500 మాత్రమేనని, మిగతాదంతా శ్రీవాణి ట్రస్టుకేనని తెలిపారు. ఏమాత్రం అకౌంట్ లేని శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వైసీపీ సర్కార్ దోచుకుంటోందన్నారు.

శ్రీవాణి ట్రస్టుకి ఆడిటింగ్ ఉందా…? అని ప్రశ్నించిన అయ్యన్న.. స్వామీజీలు ధర్మప్రచారాన్ని మరచి, రాజకీయ భజన చేస్తున్నారని ఆరోపించారు. పీఠాధిపతులు రాజకీయాలను వదిలి… ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. ‘‘కనకపు సింహాసనం మీద అయినా, కలియుగ వైకుంఠంలో అయినా కుక్కది ఒకటే బుద్ధి.. వీడు తిరుమలలోను అదేలా కాలెత్తి పోశాడు’’ ఘాటుగా బదులిచ్చారు. దీంతో.. ఏపీలో పాలిటిక్స్ మరోసారి అగ్గిరాజుకున్నట్టయ్యింది.

Exit mobile version