NTV Telugu Site icon

TTD: తిరుమలలో డ్రోన్‌ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..!

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్‌ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాలను చిత్రీకరించిన సదరు వ్యక్తిపై ఫోకస్‌ పెట్టింది.. ఇన్ స్టాలో విజువల్స్ పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం.. అయితే, హైదరాబాద్ కి చెందిన వ్యక్తి తిరుమల డ్రోన్‌ విజువల్స్.. తన ఇన్‌స్టాలో పోస్టు చేసినట్టు గుర్తించారు పోలీసులు.. మరో వైపు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లోని విజువల్స్ ని సదరు వ్యక్తి తొలగించారు..

Read Also: Human Heart: ఆమె కన్నుమూసింది.. కుటుంబ సభ్యుల నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది..

అయితే, సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఆ విజువల్స్‌ని ఫోరెన్సిక్‌ ల్యాబ్ కి పంపేందుకు టీటీడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.. ఇక, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఇది ఇటీవల తీసిన వీడియో కాదని కొట్టపారేస్తున్నారు.. పాత వీడియో కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. వీడియో కొత్తదా పాతదా అనే విషయం అటుంచితే.. అసలు శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో ఏరియల్ వ్యూలో చిత్రీకరించడం నిషేధం.. వీడియో పాతదైనా, కొత్తదైనా నేరమే.. దీంతో, సోషల్‌ మీడియాలో పోస్టుచేసినవారిపై.. యూట్యూబ్‌ చానెళ్లలో పెట్టినవారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. శుక్రవారం నాడు డ్రోన్‌తో వేంకటేశ్వరుని ఆలయాన్ని వీడియోగ్రాఫింగ్ చేసే అవకాశాలను ఖండించారు మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్‌వో నరసింహ కిషోర్.. ప్రధాన ఆలయం మరియు చుట్టుపక్కల భద్రతను పెంచారు మరియు దానిని డ్రోన్ కెమెరాతో బంధించడం అత్యంత అసాధ్యం అని తెలిపారు.. వైరల్ వీడియోను తదుపరి ధృవీకరణ కోసం ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపుతామని, తప్పు చేసిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.