Site icon NTV Telugu

Tirumala Fraud: టీటీడీ విజిలెన్స్ ఉచ్చులో మరో అక్రమార్కుడు

Tml Arrest

Tml Arrest

ఏడుకొండలకు రోజూ వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. తిరుమలలో స్వామి దర్శనం కోసం భక్తులు అక్రమార్కులను ఆశ్రయిస్తుంటారు. టీటీడీ విజిలెలెన్స్ వలలో మరో అక్రమార్కుడు చిక్కడం కలకలం రేపుతోంది. సిఫార్సు లేఖలపై పొందే విఐపి దర్శనాలను పెద్ద మొత్తంలో విక్రయిస్తూ పట్టుబడ్డాడు ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి. గతంలో మాజీ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు శ్రీహరి. అక్రమాలకు అలవాటుపడి…..ప్రధానమైన పోస్టులోనే ఉద్యోగం వుండేలా పైరవీలు సాగించాడు శ్రీహరి.

నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై పొందిన 6 వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను 18 వేల రూపాయలకు విక్రయించాడు టీటీడీ ఉద్యోగి శ్రీహరి. దీంతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు. అక్రమాలకు పాల్పడిన శ్రీహరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. శ్రీహరి బ్యాంక్ అకౌంట్లో భారీగా నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎండోమెంట్ సెల్ ద్వారా కూడా దర్శన టికెట్లు పొంది అధిక ధరకు విక్రయించినట్లు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు.

Read Also: Singareni: సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి క్లారిటీ..

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మాజీ మంత్రులు పేర్ని నాని,సిద్ధారాఘవరావు, సినీనటి ప్రణీత వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపై ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచివున్నారు భక్తులు, టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,163 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 23,709 మంది వున్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.5.38 కోట్లుగా నమోదైంది.

ఇదిలా ఉంటే.. నకిలి సుప్రభాత సేవా టిక్కెట్లతో దర్శనానికి వెళుతున్న ఘటనలు ఎక్కువయిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనలు గుర్తించింది విజిలెన్స్. నిన్న 21 మంది భక్తులు నకిలీ టికెట్ల పై దర్శనానికి వెళుతుండగా గుర్తించింది విజిలెన్స్. ఇవాళ ఇద్దరు భక్తులు కూడా నకిలీ టిక్కెట్లు పై సుప్రభాత సేవకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ దీనిపై ఆరా తీస్తోంది. సేలం కేంద్రంగా నకీలి టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దర్యాప్తు కోసం సేలంకు ప్రత్యేక బృందాన్ని పంపించింది టీటీడీ విజిలెన్స్.

Read Also: Pawan Kalyan: ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం

Exit mobile version