Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌.. రేపే ఆ టికెట్లు విడుదల

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. రేపు అనగా ఈ నెల 22వ తేదీన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. మార్చి, ఏప్రిల్‌ తో పాటు మే మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.. లక్కిడిఫ్ విధానంలో కేటాయించే సేవా టికెట్ల ఎన్‌రోల్‌మెంట్‌ని రేపు ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ..

Read Also: SBI Alert: పాన్‌ నంబర్‌ లింక్‌ చేయకపోతే అకౌంట్‌ బ్లాక్‌..! క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ

మరోవైపు.. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్ లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారులు.. ఆయా టికెట్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న భక్తులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్పాలి.. టీటీడీ ఆన్‌లైన్‌ టికెట్లను పెట్టగానే.. వెంటనే బుక్‌చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా,ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటుంటారు. దేశ విదేశాలు, రాష్ట్రాల నుంచి తిరుమలకు భక్తులు తరలివస్తారు.. గతంలో కరోనా విజృంభించడంతో భక్తులను అనుమతించని తిరుమల దేవస్థానం.. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో నిబంధనలు ఎత్తివేసింది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడం.. వివిధ సేవల్లో పాల్గొనేందుకు భక్తులు ఎప్పుడూ పోటీ పడూతేనే ఉంటారు.

Exit mobile version