Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లపై కీలక నిర్ణయం

TTD

TTD

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పెద్ద సంఖ్యలో శ్రీవారిని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా అయిపోయింది… ఇక, ఆన్‌లైన్‌లో పెట్టే దర్శనం టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో.. సాధారణ భక్తులు, ఆన్‌లైన్‌ సేవలకు దూరంగా ఉండేవారికి ఇబ్బందిగా మారింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది..

Read Also: Drunk and Drive: వాహనాదారులకు ఊరట..

అందులో భాగంగా ఇవాళ నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం భక్తులుకు 20 వేల టోకెన్లు జారీ చేసింది టీటీడీ.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 25 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు టీటీడీ అధికారులు.. మరోవైపు, రేపు ఉదయం 9 గంటలకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీకి సంబంధించిన టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.. కాగా, కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Exit mobile version