NTV Telugu Site icon

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..

TTD

TTD

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. ప్రస్తుతం వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు.. ఇక, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు ఇప్పుడు క్రమంగా తిరుమలకు వెళ్తున్నారు.. నవంబర్‌ నెల ముగుస్తుండడంతో.. డిసెంబర్‌ నెల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది టీటీడీ..

Read Also: ఏపీ వరి ధాన్యానికి బ్రేక్‌లు..! సరిహద్దులో అడ్డుకున్న తెలంగాణ అధికారులు..

ఎల్లుండి ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ మాసానికి సంబంధించిన సర్వదర్శనం టోకేన్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది… రోజుకి 10 వేల చొప్పున ఈ టోకెన్లు విడుదల చేస్తామని వెల్లడించిన టీటీడీ.. ఉదయం 9 గంటలకు ఈ టోకేన్లు విడుదల చేయనున్నారు.. మరోవైపు.. 28వ తేదీ ఉదయం 9 గంటలకు డిసెంబర్‌ మాసానికి సంబంధించిన వసతి గదులు కోటాను కూడా విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.