Huge Donations In TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు అందించే విరాళాలు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. ఏడాది కాలంలో టీటీడీ ట్రస్ట్ లకు 918 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అన్న ప్రసాదం ట్రస్ట్ కి అత్యధికంగా రూ. 339 కోట్లు రాగా, శ్రీవాణి ట్రస్ట్ కి 252 కోట్ల రూపాయల విరాళాలు అందజేశారు. అలాగే, ఆన్ లైన్ విధానంలో రూ. 579 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక, ఆఫ్ లైన్లో మరో రూ. 339 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అయితే, కోటి రూపాయలకు పైగా 84 మంది భక్తులు విరాళాలు అందించారు.
Read Also: Pawan Kalyan : ‘OG’ సినిమాపై కాపీ ఆరోపణలు చేసిన కన్నడ దర్శకుడు..
మరోవైపు, తిరుమల గిరులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కొండలపై నుంచి జాలువారుతూ భక్తులను, పర్యాటకులకు కను విందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా పొంగి పొర్లుతోంది.
Read Also: Dhruv : నాకు తెలుగులో నటించాలని ఉంది..
అలాగే, అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. ఏడుకొండల్లో పచ్చదనం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాల అందాలు భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం వద్ద జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి టీటీడీ అనుమతించడం లేదు.