Tirumala: తిరుమల శ్రీవారికి రూ.7 కోట్ల విరాళం.. టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీటీడీకి అత్యధిక మొత్తంలో విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు రూ.10 కోట్ల విరాళాలు అందించారు. ఈ నలుగురు భక్తుల్లో గోపాల బాలకృష్ణన్ అనే భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళం అందజేశాడు.
Rains In AP : ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు..
Also Read
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
తిరునల్వేలికి చెందిన గోపాల బాలకృష్ణన్ తిరుమలలో అన్నదానం సహా ఏడు ట్రస్టులకు రూ.కోటి చొప్పున రూ.7 కోట్ల చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశాడు. మరోవైపు A స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ కంపెనీ విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి అందజేసింది. అటు బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, సీ హబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని అందించాయి. మొత్తంగా ఒకే రోజు వ్యక్తిగత హోదాల్లో నలుగురు భక్తులు స్వామి వారికి ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. టీటీడీ చరిత్రలో ఒక్కరోజులో అందిన అత్యధిక విరాళాలు ఇవే కావడం గమనార్హం.
తాజావార్తలు
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..