Site icon NTV Telugu

అక్టోబర్‌ నుంచి అలిపిరి నడకమార్గంలో అనుమతి..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. ఇక, నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు.. అయితే, మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు.. వేగంగా పనులు పూర్తిచేసే పనిలో పడిపోయారు.. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తుండగా.. టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అలిపిరి నడకమార్గంలో భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి… ఇక, సెప్టెంబర్‌ 13 నుంచి టీటీడీ అగరబత్తులు భక్తులుకు అందుబాటులోకి వస్తాయని.. సప్తగిరులకు ప్రతీకగా 7 రకాల అగరబత్తులు భక్తులకు అందుబాటులో వుంచుతామన్నారు.. మరోవైపు.. బ్రహ్మోత్సవాల నుంచి భక్తులకు శ్రీవారి డైరీలు, క్యాలెండర్ల విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు.. సెప్టెంబర్‌ 19వ తేదీన అనంతపద్మానాభ వ్రతం… పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి..

Exit mobile version