NTV Telugu Site icon

TTD EO DharmaReddy: నడిచివెళ్లే భక్తులకు త్వరలో ఉచిత దర్శనం టికెట్లు

Ttd Eo Dharma Reddy

Ttd Eo Dharma Reddy

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. రోజూ వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అన్నారు. రాష్టంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి.. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు.

Read Also: AP Budget: A to Z ఏపీ బడ్జెట్‌

జి.ఎం.ఆర్ కోరిక మేరకు టీటీడీ పాలకమండలి ఆమోదంతో రాజాం బాలాజీ ఆలయం విలీనం చేసుకున్నాం అన్నారు. తిరుపతి లడ్డూలను త్వరలో రాజాం ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచుతాం అన్నారు. మరోవైపు తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. తిరుమలలో 21వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వుంటుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది సర్వదర్శనం.

ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసింది టిటిడి. దీంతోపాటు తిరుమలలో ఈ నెల 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం జరగనుంది. 30వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తారు. ఇటు తిరుమలలో 19 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 59,776 మంది భక్తులు…తలనీలాలు సమర్పించిన భక్తులు 25,773 మంది. గురువారం స్వామివారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలని టీటీడీ తెలిపింది.

Read Also:Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి