తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశాడు.. దీంతో, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.. తన పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన చంద్రమౌళి.. తన బంధువుల ఇంట్లో గుండెపోటుకు గురైన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.. అయితే, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. దీంతో, ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. చేతికి ఎదిగిన కొడుకు.. ఇలా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత.. పెళ్లి పీఠలు ఎక్కాల్సిన సమయంలో.. కన్నుమూయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు.. అయితే, ఇంత విషాద సమయంలోనూ తమ మనవత్వాన్ని చాటుకున్నారు ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు.. కన్నుమూసిన తన కుమారుడు చంద్రమౌళి కళ్లు దానం చేసేందుకు అంగీకరించారు.. ఐ బ్యాంక్‌కి చంద్రమౌళి కళ్లు దానం చేశారు ధర్మారెడ్డి కుటుంబసభ్యులు.
Read Also: Bichagadu 2 : సోషల్ మీడియాలో ‘బిచ్చగాడు 2’ హల్ చల్.. అసలేమైంది
కాగా, చంద్రమౌళిరెడ్డి.. డిసెంబర్ 18 ఆదివారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. ఇరవై ఎనిమిదేళ్ల చంద్రమౌళికి ఇటీవల చెన్నైలోని టీటీడీ స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు, ఇసుక మైనింగ్ వ్యాపారి ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. 2023 జనవరిలో తిరుమలలో వివాహం నిర్వహించాలని నిర్ణయించారు.. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో.. కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు..
