TTD EO Dharma Reddy: తిరుమలలో వసతి గదుల అద్దె పెంపుపై పెద్ద దుమారమే రేగుతోంది.. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి సిద్ధం అవుతోంది.. వెంటనే పెంచిన అద్దెలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.. అయితే, గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అసలు అద్దె ఏ గదులకు పెంచామనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.. తిరుమలలో మొత్తం 7500 గదులు, నాలుగు యాత్రిక సదన్‌లు ఉన్నాయన్న ఆయన.. 50, 100 రూపాయల గదులు 5 వేలు ఉన్నాయన్నారు.. ఈ ధరలు 40 సంవత్సరాల క్రితం నిర్ణయించింది.. ఇప్పటి వరకు మార్చిందే లేదన్నారు.. అయితే, తిరుమలలో 120 కోట్ల రూపాయలతో పలు గదులను ఆధునీకరించామని.. 50, 100 రూపాయల గదులల్లో ఫ్లోరింగ్, గ్రీజర్లు వంటివి కల్పించామని వివరించారు.. పద్మావతీ, ఎంబీసీ కార్యాలయాల్లో ప్రముఖులకు ఇచ్చే గదులు ఉంటాయని.. నారాయణగిరి, ఎస్వీ అతిధి గృహం, స్పెషల్ టైప్ అతిధి గృహాలు వీఐపీ కోటా కింద గదులు ఉంటాయని.. ఎంబీసీ కార్యాలయం కింద ఉన్న ఈ మూడు అతిధి గృహాలకు సంబంధించి గదుల ధరలను మాత్రమే పెంచామని వెల్లడించారు..
Read Also: India vs Sri Lanka 2nd ODI: భారత బౌలర్ల ధాటికి శ్రీలంక చిత్తు.. 215 పరుగులకి ఆలౌట్
పద్మావతీ, ఎంబీసీ కార్యాలయాలకు సంబంధించి వ్యత్యాసం లేకుండా చేయాలని పెంచినట్టు క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో.. 8 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అతిధి గృహాలను ఆధునీకీకరించామని వెల్లడించారు.. 170 గదులను పూర్తిగా మరమ్మత్తులు చేసి వ్యత్యాసం లేకుండా ధరలు పెంచినట్టు చెప్పుకొచ్చారు.. అయితే, మిగతా 50, 100 గదుల ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.. ఇక, మరమ్మతులు చేసిన గదులకు ఐదు లక్షల చొప్పున ఖర్చు చేశామని వివరించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. కాగా, టీటీడీ అధికారులు పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని రాజమండ్రిలో నిరసనకు దిగారు.. టీటీడీ చర్యలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట సోము వీర్రాజు బైఠాయించి నిరసన తెలియజేశారు. విశాఖ కాలెక్టర్రేట్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ ఎంపీ జీవీఎల్.. టీటీడీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయల పట్ల చిన్న చూపు చూస్తుంది. ప్రజలు తమ కష్టాలను దేవుడుకి చెపుకోవడానికి తిరుమల వస్తే వారిని ఇబ్బంది పెడతారా? అని ఫైర్ అవుతోంది బీజేపీ..
