Site icon NTV Telugu

Tirumala Laddu: శ్రీవారి లడ్డూపై అపోహలు వద్దు.. టీటీడీ వివరణ

Laddu Ttd

Laddu Ttd

తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎంత బిజీగా వున్నా.. తిరుమల వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత వుంటుందని, కోరిన కోరికలు ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని అంటారు. శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలు వద్దంటోంది టీటీడీ. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్రసాదాల‌ను ఒక ప్రత్యేక‌ ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్రసాదాల‌ను కౌంట‌ర్లకు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శక‌త ఉంటుందని టీటీడీ తెలిపింది.

Read Also: Kodali Nani Challenge: చంద్రబాబుకి నాని సవాల్.. ఇవే చివరి ఎన్నికలు!

వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ల‌డ్డూ బ‌రువు, నాణ్యత విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు.

సాధార‌ణంగా ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదేని ఇబ్బంది త‌లెత్తితే వెంట‌నే అక్కడ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేస్తే, అక్కడిక్కడే స‌మ‌స్యను ప‌రిష్కరించే వ్యవ‌స్థ టీటీడీలో ఉంది. కానీ స‌దరు భ‌క్తుడు ఇవి ఏమి చేయ‌కుండా సోష‌ల్ మీడియాలో టీటీడీపై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయంఅని టీటీడీ పేర్కొంది. భ‌క్తుడు ఆరోపించిన‌ట్లు ల‌డ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్యత్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ ఒక ప్రకటనలో కోరుతోంది.

Read Also: T20 World Cup: ఇండియా ఓటమిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఏమన్నారంటే..

Exit mobile version