YV Subba Reddy: వైఎస్ జగన్మోహన్‌రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. బాపట్ల పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లు చెప్పే మోసపూరితమైన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని పట్టుకొని మూడు ముక్కల ముఖ్యమంత్రి అని సంబోధించడం ఎంత వరకు సరైంది అని ఫైర్ అయ్యారు.. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలని హితవుపలికారు వైవీ సుబ్బారెడ్డి.. ఎందరు విడిగా వచ్చినా.. అంతా కలిసి వచ్చినా.. 2024 ఎన్నికల్లోనూ గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Woman Harassment Case: భారత మహిళపై లైంగిక వేధింపులు.. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే?
కాగా, దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను తాము ప్రవేశపెట్టామని, వాటిని సమగ్రంగా, సమర్థవంతంగా లబ్దిదారులకు చేరవేస్తోన్నామని గతంలోనూ స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి లబ్దిదారులకు లేదని చెప్పారు. పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందుకుంటోన్నారని పేర్కొన్నారు.. తాము అనుసరిస్తోన్న పారదర్శకత, అవినీతి రహిత పరిపాలనే 2024లో కూడా తమకు అధికారాన్ని అప్పగిస్తుందని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు.. తమ పార్టీకి మూలాధారాలని ఆయన వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలు మాత్రమే కాదు.. వచ్చే 15 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండేలా అండగా నిలుద్దామంటూ గతంలో పిలుపునిచ్చిన విషయం విదితమే.