నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు.
ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో దర్శన టోకేన్లు వున్న భక్తులను కొండా పైకి అనుమతిస్తుంది టీటీడీ. అలాగే అలిపిరి నడకమార్గంలో రావడానికి భక్తులకు అనుమతి ఇచ్చింది. ఇక ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి లభించింది.
