Site icon NTV Telugu

Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో తప్పిన పెనుప్రమాదం..

Srisailam Ghat Road

Srisailam Ghat Road

Srisailam Ghat Road: శ్రీశైలం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.. శ్రీశైలం – హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. శ్రీశైలం ఘాటు రోడ్డు అంటేనే భారీ మలుపు, ప్రమాదకరమైన లోయలు ఉంటాయి.. అయితే, డ్యామ్‌ సైట్‌ పాయింట్‌ దగ్గర ఉన్న భారీ టర్నింగ్‌ దగ్గర అదుపు తప్పిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఆఎస్‌ఆర్టీసీ)కు చెందిన టీఎస్‌ 09 జెడ్ 7822 నంబర్‌ కలిగిన బస్సు.. గుంతలో ఇరుక్కుపోయి ఆగిపోయింది.. దీంతో, ప్రమాదం తప్పింది.. బస్సు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.. బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతంలో.. మరో పది అడుగుల దూరంలో భారీలోయ ఉండడంతో.. అది చూసి భయాందోళనకు గురయ్యారు అందులో ప్రయాణిస్తున్నవారు.. గత నెలలో కూడ అదే ప్లేస్ లో మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.. ఇక, ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరగంతో.. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. చాలు సేపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అయితే, బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్‌-కిరణ్‌ కాంబినేషన్‌పై అధిష్టానానిదే నిర్ణయం..!

Exit mobile version