Traffic Police: కాలితో తన్నుతూ.. ట్రాఫిక్ పోలీస్ జులుం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళుతుంటారు వాహనదారులు. ఇక లారీలు, పెద్ద వాహనాలైతే చెప్పాల్సిన పనిలేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు లాఠీలకు పనిచెబుతుంటారు. జరిమానాలతో బుద్ధి చెబుతారు. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆ వ్యక్తి ఏం తప్పుచేశాడో, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎందుకు కొడుతున్నాడో ఎవరికీ అర్థం కావడంలేదు. సామాన్యుడిపై అలా నడిరోడ్డు మీద కాలితో తన్నడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ తో ఏదో మాట్లాడడం, వెంటనే పోలీస్ అతడిని ఎగిరెగిరి తన్నడం వీడియోలో కనిపిస్తోంది. అక్కడినించి వెళ్ళిపోతున్నా.. పోలీస్ మాత్రం వదలలేదు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఉన్నతాధికారులు ఈ ఫ్రెండ్లీ పోలీస్ భరతం పడతారా… మేమింతే అని అతడిని వదిలిపెడతారో చూడాలి. సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఐపీఎస్ స్థాయి అధికారులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా.. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఇలా వ్యవహరించడం మామూలైపోయింది. డీజీపీ గారూ.. జర చూడండి సార్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..