NTV Telugu Site icon

YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ భద్రత, ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు..

Ysrcp

Ysrcp

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీకి సిద్ధం అవుతోంది.. వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి.. తొలి రోజున సర్వమత ప్రార్ధనలతో ప్రారంభం అయ్యే ప్లీనరీ సమావేశాలు… రెండో రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్ ప్రసంగంతో ముగియబోతున్నాయి.. వైపీసీ ప్లీనరీ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు, మరోవైపు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల కోసం రేపు ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది.. ఒక్కో జిల్లాకు రెండు కౌంటర్లు కేటాయిస్తున్నారు.. రిజిస్ట్రేషన్ సమయంలో ప్లీనరీకి హాజరైన నేతలు, కార్యకర్తలకు స్పెషల్ కిట్ అందించనున్నారు.. జ్యూట్ బ్యాగ్‌తో ఆ కిట్ ఉండనుంది.. కిట్‌లో భాగంగా పార్టీ మేనిఫెస్టో, పార్టీ జెండా, 16 పేజీల సంక్షేమ పథకాల బుక్ లెట్, ప్రజలకు ముఖ్యమంత్రి సంతకంతో లేఖ, నవరత్నాల ముద్రతో ఒక మగ్, పెన్ను, నోట్ ప్యాడ్, ఫ్యాన్ గుర్తు కీ చెయిన్ ఇలా ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు అందజేయనున్నారు..

Read Also: Bhagwant Mann: పంజాబ్ సీఎం రెండో పెళ్లి.. అరవింద్ కేజ్రీవాల్ హాజరు

ఇక, సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇలా ప్లీనరీలోనే ఉండనుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు.. ప్లీనరీ జరగనున్న రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.. హనుమాన్ జంక్షన్‌ దగ్గర డైవర్షన్ పెనుమూడి బ్రిడ్జి మీదుగా హైవే 16 నుంచి హైవే 216కు దరా మళ్లించనున్నారు.. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా ఇబ్రహీంపట్నం, మైలవరం మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. ఇక, గన్నవరం నుంచి ఆగిరిపల్లి, కేసినపల్లి.. మీదుగా హైదరాబాద్‌ వెళ్లవచ్చు.. చెన్నై నుండి హైదరాబాద్, వైజాగ్ వచ్చే వాహనాలు డైవర్ట్ చేయనున్నారు.. దాచేపల్లి, పెనుమూడి బ్రిడ్జి మీదగా హైదరాబాద్‌ – వైజాగ్ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.. చిలకలూరిపేట ట్రాఫిక్ డైవర్షన్‌తో పర్చూరు, చీరాల, చెరుకుపల్లి, పెనుమూడి బ్రిడ్జి, తాడికొండ, కొల్లూరు, కరకట్ట మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది.

మరోవైపు, వైసీపీ ప్లీనరీ కోసం వైజాగ్ నుంచి వచ్చే వాహనాలకు ఆర్కే వెనుజీయాలో పార్కింగ్ సదుపాయం కల్పించినట్టు సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు.. వీఐపీల వాహనాలకు నాగార్జున యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం ఉంటుందన్న ఆయన.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుంచి వాహనాలలో వచ్చే వారు కంతేరు జంక్షన్‌లో దిగాలని సూచించారు.. పార్కింగ్ ప్లేసెస్‌ పుల్లలమ్మ చెరువు, కేవీ రెడ్డి, చర్చ్ వద్ద మొత్తం 25 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు భారీ వాహనాలకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఆ వాహనాలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. ఇక, ప్లీనరీ మొత్తం సీసీ‌ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు సీపీ కాంతిరాణా టాటా.