లంచం.. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ స్థాయి అధికారులకు మంచి ఆదాయ వనరు.. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదో.. వేరే కారణమో తెలీదు గానీ చేతివాటం కామన్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా పట్టుబడుతుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. బెజవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతివాటం చూపించాడు….ట్రిపుల్ రైడింగ్ లో పట్టుపడ్డ యువకులకు బుద్ది చెప్పాల్సింది పోయి….డబ్బులకు కక్కుర్తిపడి వంకర బుద్ధి చూపించాడు….చదువుకునే యువకుల వద్ద 500 లంచం తీసుకుని వదిలేసాడు…ఈ వ్యవహారం కాస్త యువకులు వీడియో తియ్యటంతో బయటపడింది.
రోడ్ యాక్సిడెంట్స్ నివారించటానికి విజయవాడ నగర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో రాత్రి ,పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు….ఈ తనిఖీలో వందల మందికి ఫైన్స్ వేస్తూ ప్రత్యేక కౌన్సిలింగ్ సెక్షన్ కూడా నిర్వహిస్తున్నారు…కానీ ఈ తనిఖీల్లో జేబులు నింపుకోవటం అలవాటు చేసుకున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాస్త బాగా చేతివాటం చూపిస్తూ, అందిన కాడికి నొక్కేస్తూ ఫైన్స్ వెయ్యకుండా దొరికిన వాహనాలను వదిలేస్తున్నాడు….నిన్న రాత్రి జరిగిన తనిఖీల్లో కానిస్టేబుల్ కు డబ్బులిచ్చిన యువకులు ఆ వ్యవహారం అంత వీడియో తియ్యటంతో అసలు విషయం బయటపడింది.
Read Also: Sun Colour: సూర్యుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా..? పసుపు రంగు మాత్రం కాదు.
బెజవాడ సితార సెంటర్లో ఎప్పటిలానే తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ట్రిపుల్ రైడింగ్ లో ఓ యువకుడు దొరికాడు….సాధారణంగా అయితే వారికీ 3000 ఫైన్ వేసి కౌన్సిలింగ్ ఇస్తారు…కానీ ఆలా చెయ్యని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని 3000 ఫైన్ కడితేనే బైక్ కీ ఇస్తా అనటంతో చేసేది లేక అంత డబ్బు లేదని కానిస్టేబుల్ ను ప్రాధేయ పడ్డారు….దాంతో ఎంత డబ్బుందని విద్యార్ధులని అడిగి వారి వద్ద వున్న 500 కు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Read Also: Mrunal Thakur: అతడితో పిల్లలను కనాలని ఉందంటున్న సీత..
ఎవరికి కనిపించకుండా పేపర్ లో పెట్టివ్వమని యువకులకు చెప్పటంతో….అలానే ఓ పేపర్ లో పెట్టి డబ్బులు ఇస్తూ మొత్తం వీడియో తీసారా యువకులు…యువకులు తీసిన వీడియో లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గమ్మున వాళ్ళిచ్చిన పేపర్ తీస్కుని ఏమి తెలియనట్లు చేతిలో మడత పెట్టేసాడు….ఇలా జరగటం నగరంలో ఇదేం మొదటి సారి కాదు…గతంలో వంద ఇస్తే బండి ఇచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు వంద కాస్తా 500 అయింది. అక్కడక్కడా ఇలాంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చేతి వాటం చూపిస్తూనే వున్నారు…వెహికల్స్ కి చలాన్లు వెయ్యటం మీదనే కాకుండా ఇలాంటి వారిపై కూడా ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలంటున్నారు బెజవాడ జనం.
