NTV Telugu Site icon

Budameru Canal: ఈలప్రోలు సహా ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్..

Elaprolu

Elaprolu

Budameru Canal: కృష్ణానది ఉధృతి శాంతించిన బుడమేరు వాగు పొంగిపొర్లుతున్నాయి. కవులూరు వద్ద బుడమేరుకు గండి పడటంతో నీట మునిగిన వేల ఎకరాలు.. నదిని తలపిస్తున్న వ్యవసాయ పొలాలు… కృష్ణానదిని తలదన్నేలా పంట పొలాలపై భారీగా ప్రవహిస్తున్న బుడమేరు వాగు.. ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలప్రోలు సమీప గ్రామాలలో దాదాపు 6 ఎకరాలలో భారీగా ప్రవహిస్తున్న బుడమేరు.. దీంతో ఈలప్రోలు నుంచి 5 గ్రామాల కు రాకపోకలు బంద్ అయ్యాయి. గత నాలుగు రోజుల నుంచి జలదిగ్బంధంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు.. బుడమేరు వాగు ఉప్పొంగడంతో అర కిలోమీటర్ మేర కొట్టుకు పోయిన రోడ్డు.. రోడ్డు కొట్టుకు పోవడంతో పైడూరి పాడు, రాయనపాడు, కవులూరు, జక్కంపూడి,ఈలప్రోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Gold Rate Today: దిగొస్తున్న పసిడి ధరలు.. 10 రోజుల్లో ఒకేసారి! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

అలాగే, బుడమేరు వాగు ఉప్పొంగడంతో 35 ఎకరాలలో ఉన్న చాపల చెరువు 70 ఎకరాలలో ఉన్న చాపల చెరువు పూర్తిగా నీటి మునిగాయి. చాపల చెరువులో రెండు కోట్ల నష్టపోయిన రైతులు.. 16000 ఎకరాలలో వరి,మిర్చి, పత్తి పంటలు నీట మునగడంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. పొట్ట దశలో ఉన్న వరి నీటి మునగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి, లంక గ్రామాల ప్రజలు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం లంక గ్రామాల్లో వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో బయటపడ్డ రహదారులకు అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. కొల్లూరు నుంచి పదిలంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ద్వంసం అవడంతో.. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నారు.

Show comments