Site icon NTV Telugu

Top Hedlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం..

పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

రేపు సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

రేపు సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఉదయం 9.54 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం ప్రాజెక్టు 24,059.53 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు అంతస్తులు నిర్మించారు.

విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడమే మా లక్ష్యం..

డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా విశాఖ ఆవిర్భవిస్తుంది.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తుంటే 50శాతం విశాఖకే వస్తున్నాయి.. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో పని చేస్తున్నాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడమే కాదు నిర్వహణ కోసం అవసరమైన భారీగా సహాయం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 3 వేల కోట్లు ఇచ్చింది అని లోకేష్ గుర్తు చేశారు

ఆఫ్ఘాన్ దాడిలో 50 మంది పాక్ సైనికులు హతం.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..

ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.

పవన్తో నా ప్రయాణం అలా మొదలైంది.. నాదెండ్ల ట్వీట్కి డిప్యూటీ సీఎం రియాక్షన్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు. పవన్ దిశా నిర్దేశం, స్ఫూర్తినిచ్చే నాయకత్వం ఎప్పుడూ మాకు బలమైంది.. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌పై చర్చలు జరిపాం అన్నారు. యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఏపీ కోసం కృషి చేస్తున్నామన్నారు. అయితే, జనసేన అధ్యక్షుడు, పార్టీ నాయకులు, వీర మహిళల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఏడేళ్ల రాజకీయ ప్రయాణంలో సేవ, స్ఫూర్తి, సంకల్పంతో నిండినది అని మత్రి నాదెండ్ల ట్వీట్ చేశారు.

“అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత వివాదం..

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.

పాక్ – ఆఫ్ఘన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తుందా?

ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాయాది దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘన్ దాడి చేసి 58 మంది పాకిస్థా న్ సైనికులను చంపింది. తాజా పరిస్థితులు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ప్రస్తుతం పాక్ – తాలిబన్ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే అంశంపై ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది. పాక్- తాలిబన్ల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పుడు ప్రపంచం చూపు సౌదీ వైపు మళ్లింది. ఆఫ్ఘన్- పాక్‌పై దాడి చేయడంతో.. ఈ దాడికి ప్రతిస్పందనగా సౌదీ అరేబియా ఎలాంటి చర్య తీసుకుంటుందనేది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా – పాకిస్థాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పాక్‌ పై జరిగే ఏదైనా దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పరిగణిస్తామని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఒప్పందంలో ఒక దేశంపై దాడి జరిగితే, మరొక దేశం సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

అది పూజకు పనికిరాని పువ్వు లాంటిది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్‌లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక బుల్డోజర్ కావాలా?” అని ఆయన అన్నారు. “ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగేవి కావు. ఇది ప్రజల గౌరవం కోసం జరుగుతున్న పోరాటం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడు. పార్లమెంట్‌లో చేసే పనిని అసెంబ్లీలో చేస్తే చెల్లదని ఆయనకే తెలుసు. ఆజారుద్దీన్‌కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా కోర్టులో నిలవదు. అతనినీ మోసం చేశాడు. తెలిసి తెలిసి మోసం చేయడమే రేవంత్ పాలసీ,” అని కేటీఆర్ అన్నారు.

విరిగిపడ్డ కొండచరియలు.. పేక మేడలా కూలిన భవనం..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎంతో మంది నిరాశ్రయులు అవుతున్నారు. నార్సు ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలడంతో.. అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా ఇళ్లను ముందే ఖాళీ చేసి వెళ్లి పోయారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జ‌మ్ముక‌శ్మీర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు భవనం పై పడటంతో నేలమట్టం అయ్యింది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇల్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కొందరు ఆ భవనం దగ్గరే నిలబడి ఉండగా కూలుతున్న సమయంలో పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే జ‌మ్ముక‌శ్మీర్ లో ఈ ఏడాది వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. వ‌రుస ప్ర‌మాదాల‌కు చెట్లను న‌రికివేస్తూ కొండ‌ల‌పై రోడ్లు వేయ‌డ‌మే కార‌ణమ‌ని, టూరిజం కోసం ప్ర‌కృతిని నాశ‌నం చేయ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు హెచ్చ‌రించింది.

మంత్రి వివేక్‌ సంచలన వ్యాఖ్యలు.. “నాపై కుట్రలు జరుగుతున్నాయి”

తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. మంత్రి వివేక్‌ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సహ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా నిలిచాయి. నిజామాబాద్‌లో మీడియాతో మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. “నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఎవరో నాకు తెలుసు,” అని వ్యాఖ్యానించారు. “మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి నాపై విమర్శలు చేయిస్తున్నారు. లక్ష్మణ్‌ నాపై ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఆయనపై ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. రాజకీయాల్లో లక్ష్మణ్‌ను ప్రోత్సహించింది మా నాన్నగారే,” అని వివేక్‌ చెప్పారు. తనపై వస్తున్న వదంతులపై మంత్రి వివేక్‌ స్పష్టతనిచ్చారు. “లక్ష్మణ్ వస్తే నేను వెళ్లిపోతాననేది పూర్తిగా అబద్ధం. అలాంటి వ్యాఖ్య నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను తప్పుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు,” అని వివేక్‌ చెప్పారు. “నాది మాల జాతి అని విమర్శించడం చాలా బాధాకరం. జాతి పేరుతో రాజకీయాలు చేయడం తగదు. మనం ప్రజాసేవ కోసం ఉన్నాం, విభజన కోసం కాదు,” అని మంత్రి వివేక్‌ అన్నారు.

 

Exit mobile version