Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ‘రాజా సాబ్’ ఈవెంట్.. ఈ రూట్లలో వెళ్లకండి..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను నిర్వహిస్తున్నందున, ముఖ్యంగా కూకట్‌పల్లి, మాదాపూర్ మరియు గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండటానికి ఈ క్రింది మార్గాలను నివారించాలని సూచించారు.

ట్రాన్స్ జెండర్స్‌కు గుడ్ న్యూస్.. జీవీఎంసీలో ఉద్యోగాలు..

విశాఖ నగరంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు పోలీసులు శుభవార్త అందించారు. ఉపాధి కల్పన దిశగా నగర పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి వినూత్న ఆలోచనతో ముందడుగు వేశారు. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ఉపాధి ప్రణాళికను అమలు చేస్తున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ చొరవతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ మొదలైంది. మొదటి విడతలో భాగంగా 25 మందికి స్వీపర్లుగా ఉద్యోగాలు అందించారు. దీంతో పాటు స్వయం ఉపాధి సాధన కోసం సీపీ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్..

జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌ లోని ఒక స్థానిక మార్కెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరేతోయిబాకు చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. మార్కెట్ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో ఉగ్రవాదులకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. ఫుటేజీలో కనిపించిన ఉగ్రవాదుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్‌గా గుర్తించారు. మరో వ్యక్తి హంజుల్లా అనే పాకిస్తానీ కమాండర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. డెంగర్ పోరా, ఖాజీబాగ్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టారు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ గాలింపు చర్యల్ని చేపట్టారు. ఉగ్రవాదుల కదలికల్ని తెలుసుకోవడానికి, నిఘా సమాచారాన్ని సేకరించే ప్రయత్నాల్లో భాగంగా స్థానిక నివాసితులను కూడా ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ డిసెంబర్ 25న, సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో రికార్డయింది. మహ్మద్ లతీఫ్ భట్ ఈ ఏడాది నవంబర్‌లో లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ కాశ్మీర్ రివల్యూషన్ ఆర్మీ (కేఆర్‌ఏ)లో చేరాడని అధికారులు తెలిపారు.

అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక పోతున్నారు.. అవగాహన రాహిత్యంతో కామెంట్లు..!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై మరోసారి మండిపడ్డారు సత్యకుమార్‌.. భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య విజ్ఞాన కార్యక్రమాలపై, యోగాభ్యాసం అభివృద్ధిపై అనేక ప్రయోజనాలను తెలియజేశారు. మెడికల్, ఆరోగ్య పరంగా రాష్ట్రం ఎదుగడపై, ప్రజల ఆరోగ్య సదుపాయాల గురించిన అంశాలు ప్రధానంగా చర్చ జరిగాయి. ర్ణాలో ఓ సందర్భంగా మంత్రి హెల్త్ మినిస్టర్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంత్రుల ప్రకారం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడంలో యోగా వంటి కార్యక్రమాలు సహాయకరంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమాల విజయవంతమైన రోల్అవుట్ గత కొన్ని సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపు అని వ్యాఖ్యానించారు. రెండు కోట్లు మందికి పైగా వ్యక్తులు యోగాలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అనసూయకి సపోర్టుగా శివాజీపై నా అన్వేషణ దారుణ వ్యాఖ్యలు

నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన ఇచ్చిన ‘ఉచిత సలహా’ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా, మహిళా కమిషన్ నోటీసుల వరకు వెళ్ళింది. “హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది. చీరలో ఉండే అందం మరెందులోనూ ఉండదు.”, “బయట ప్రజలు మీ స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు నటించినా, లోపల మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటారు.”, ఈ క్రమంలో ఆయన ‘దరిద్రపుముం**’, ‘సామాన్లు’ వంటి కొన్ని అనుచిత పదజాలాన్ని వాడటం విమర్శలకు ప్రధాన కారణమైంది.

జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు.. చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా… దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అయితే, జిల్లాల పునర్విభజన ప్రక్రియపై, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీడియాకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. పునర్విభజన అంశంలో జరుగుతున్న ప్రచారం తుది నిర్ణయాలు కాదని స్పష్టంచేశారు.

వాడివేడిగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు..

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల స్థాయిలోనే ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!

సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద ఇదే బస్సు ఒక స్కూటీని కూడా ఢీకొట్టిందని, అయినా డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి భద్రత, భరోసా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పాలనలో స్పష్టమైన తేడా ఉందని, మొన్నటి ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రసంగంలో మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని, రాబోయే ఏప్రిల్‌ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ క్యాబినెట్ ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు మాట తప్పే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా చెప్పారు.

నా ప్రాణాలకు ముప్పు వస్తే ఆ ఇద్దరే కారణం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన దువ్వాడ..

నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌.. నా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఆ ఇద్దరే కారణం అంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై తాను నిర్భయంగా మాట్లాడుతున్నానని, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడినని అన్నారు. ప్రజల సమస్యల కోసం గొంతు ఎత్తడమే తన లక్ష్యమని తెలిపారు.

 

Exit mobile version