భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం ఇదే..
ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి. ఇలాంటి సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి నాసా అధ్యయనం సమాధానం ఇస్తోంది. భూమిపై ఉన్న నీటిలో ఎక్కువ భాగం గ్రహం ఏర్పడినప్పుడే ఉన్న మూల పదార్థాల నుంచి వచ్చిందని నాసా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. 4 బిలియన్ ఏళ్లలో ఉల్కలు భూమికి తీసుకువచ్చిన నీటి పరిమాణం చాలా తక్కువ అని ఈ పరిశోధన వెల్లడించింది.
గూగుల్ సలహాతో కోటీశ్వరుడైన రైతు..
ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్‌ను కేవలం వినోద సాధనంగా మాత్రమే వినియోగిస్తున్నారు. యూట్యూబ్ చూడటానికో, లేదంటే ఓటీటీలో సినిమాలను చూడటానికో వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ చాలా మందికి భిన్నంగా ఒక రైతు ఇంటర్నెట్‌ను వాడి కోటీశ్వరుడు అయ్యాడు. ఇంతకీ ఇంటర్నెట్‌ను వాడి ఆయన అలా ఎలా కోటీశ్వరుడు కాగలిగాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని బెల్సాండి గ్రామానికి చెందిన జీవేష్ చౌదరి.. ఒక రైతు. నిజానికి మనోడు అందరిలాగా ఇంటర్నెట్‌ను కేవలం వినోద సాధనంగా మాత్రమే వినియోగించలేదు. తన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాడుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఈ సందర్భంగా జీవేష్ చౌదరి మాట్లాడుతూ.. గూగుల్ నుంచి కొత్త వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, తన వ్యవసాయ భూమిలో అధునాతన G-9 రకం అరటిపండ్లను పండిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటిపారుదల నిర్వహణ, గూగుల్ నుంచి సరైన ఎరువుల వాడకంపై సమాచారాన్ని సేకరించానని వివరించారు. బీహార్ ప్రభుత్వం అందించిన సబ్సిడీ మొక్కలు కూడా తన ప్రయత్నాలను మరింత బలోపేతం చేశాయని, ప్రస్తుతం తన పొలంలో ఉత్పత్తి చేస్తున్న అరటిపండ్లు దాదాపు 4 అడుగుల పొడవు, అధిక నాణ్యత కలిగి ఉంటాయని వెల్లడించారు. ఇవి స్థానిక వ్యాపారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. లాభం పరంగా ఒక అరటి కట్టాకు సుమారు రూ.10 వేలు సంపాదిస్తు్న్నట్లు తెలిపారు. మార్కెట్ అనుకూలంగా ఉన్న టైంలో ఈ లాభం మరింత పెరుగుతుందని వెల్లడించారు. నిజానికి జీవేష్ విజయం జిల్లాలోని ఇతర రైతులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.
పంజాగుట్టలోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..
హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ముఠాలు తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. తాజాగా పంజాగుట్టలోని ఒక ప్రముఖ కాలేజీలో వెలుగుచూసిన డ్రగ్స్ ఉదంతం నగరవాసులను విస్తుపోయేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీ ప్రాంగణమే మత్తు పదార్థాల వినియోగానికి వేదికగా మారడం గమనార్హం. పంజాగుట్ట పరిధిలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు కొందరు అనుమానాస్పదంగా తిరుగుతుండటం పోలీసుల దృష్టికి వచ్చింది. వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులు కాలేజీ సెల్లార్‌లోనే డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం రాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికీ డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. వీరి వద్ద నుంచి 10 గ్రాముల ఖరీదైన ఎండిఎంఏ (MDMA) డ్రగ్‌తో పాటు, నిషేధిత హైడ్రోపోనిక్ గంజాయి , సాధారణ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ధర్మేంద్రకు పద్మ విభూషణ్, మమ్ముట్టికి పద్మ భూషన్..
కేంద్రం ఆదివారం 2026 ఏడాదికి గానూ పద్మ అవార్డుల్ని ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ విభాగాలకు సంబంధించి 131 మందికి అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో ప్రజా జీవితం, కళలు, సినిమా, సాహిత్యం, క్రీడలు, ప్రజా వ్యవహారాల నుండి అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐదుగురికి భారత్ రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జాబితాలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు లేదా విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. 16 మందికి మరణానంతరం ఈ గౌరవాలు దక్కాయి.
మమతా బెనర్జీ మంత్రగత్తె, ఆమె తల నరకాలి.. వివాదంగా బీజేపీ నేత వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా, బీజేపీ సీఎం మమతా బెనర్జీపై విరుచుపడింది. బీజేపీ నాయకుడు సంజయ్ దాస్ టీఎంసీ అధినేత్రిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బెంగాల్ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్ హాజరైన ఓ కార్యక్రమంలో సంజయ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘ ఈ ముసలి మంత్రగత్తె పశ్చిమ బెంగాల్‌ను పాలిస్తోంది. ఆమె తలను ఖడ్గంతో నరకాలి’’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంజయ్ దాస్ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బీజేపీ మథురాపూర్ యూనిట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ విరుచుకపడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి హత్యకు బహిరంగ పిలుపుగా టీఎంసీ అభివర్ణించింది. బెంగాల్ కోరుకునే మార్పు ఇదేనా? మహిళలను బెదిరించడం, హింసను కీర్తించడం, మూకదాడి భాషను వేదికపై సాధారణీకరించడం జరుగుతోందా?? అని టీఎంసీ ప్రశ్నించింది.
తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులు వచ్చింది వీరికే..!
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ, తమ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 131 అవార్డులలో తెలుగు రాష్ట్రాల నుండి 11 మంది ప్రముఖులు ఎంపికవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణం. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ఎంపికలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రచారం కోరుకోకుండా, మారుమూల ప్రాంతాల్లో ఉంటూ సమాజ హితం కోసం పాటుపడే ‘అన్‌సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని వీరులు) కి పెద్దపీట వేస్తోంది. 2026 జాబితాలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక దిగ్గజాలు, కళాకారులతో పాటు, పాడి పరిశ్రమలో మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించిన వారు, వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కిన శాస్త్రవేత్తలకు ఈ గౌరవం దక్కడం ఈ అవార్డుల గౌరవాన్ని మరింత పెంచింది.
షేక్ హసీనా ప్రసంగం.. భారత్‌పై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం..
మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన ప్రసంగం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలకు కారణమైంది. బంగ్లాదేశ్ శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరివర్తనకు ఆమె వ్యాఖ్యలు ముప్పు కలిగిస్తున్నాయని మహ్మద్ యూనస్ తాతాల్కిక ప్రభుత్వం ఆరోపించింది. హసీనాను ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. బంగ్లాదేశ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, ‘‘మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించిబడిన హసీనా జనవరి 23న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తొలగించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికి తన పార్టీ విశ్వాసపాత్రులను మరియు సాధారణ ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించారు’’ అని ప్రభుత్వం పేర్కొంది.
భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుంభాషు శుక్లాకు అశోక చక్ర అవార్డు వరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. వీటిలో ఆరు మరణానంతర అవార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ 70 అవార్డుల్లో ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు, ఒక మరణానంతర అవార్డుతో సహా, ఒక బార్ టు సేన మెడల్ (శౌర్యం), 44 సేన మెడల్స్ (శౌర్యం), ఐదు మరణానంతరం సహా, ఆరు నవో సేన మెడల్స్ (శౌర్యం), రెండు వాయు సేన మెడల్స్ (శౌర్యం) ఉన్నాయి.
SIని ఢీకొట్టి షాక్ ఇచ్చిన మందుబాబులు.. అంతటితో ఆగకుండా..!
హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవింగ్ ఘటనలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. పోలీసుల కఠిన తనిఖీలు, భారీ జరిమానాలు, రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ, మద్యం సేవించి వాహనాలు నడిపే యువత దుశ్చర్యలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు వేగంగా వచ్చి తనిఖీల్లో ఉన్న ఎస్సైపై నేరుగా దూసుకెళ్లింది. ఢీకొన్న వేగానికి ఎస్సై కారు బానెట్‌పై పడిపోయాడు. అయితే షాక్‌కు గురైన ఎస్సైను బానెట్‌పై పెట్టుకుని కారు ఆగకుండా కొనసాగడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కారు కొంతదూరంలో వేగం తగ్గడంతో ఎస్సై దూకి బయట పడగా అతనికి స్వల్ప గాయాలయినట్లు పోలీసులు తెలిపారు.
