Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్‌.. శార్దూల్ ఠాకూర్‌, రుదర్‌ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..!

IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్‌లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన “హోం సిటీ” జట్టుకే ఆడబోతున్నాడు. IPL 2025 వేలంలో అమ్ముడుకాకపోయిన తరువాత ఆయనను LSG రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తీసుకుంది. పేస్ బౌలర్‌గా పాటు, అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన శార్దూల్ ఠాకూర్‌.. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ వంటి స్టార్ బౌలర్లకు బ్యాకప్‌గా ఉంటారని అంచనా వేసినట్లు ఉంది ఎంఐ. ఈ విషయాన్నీ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో శార్దూల్ చేరికను ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. అందులో ఆయన “శార్దూల్ ఠాకూర్ ఆరా రే!” అంటూ ఫోన్‌లో మాట్లాడుతున్న సన్నివేశం కనిపిస్తుంది.

త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు. అయితే, మేము చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాం. సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం సలహాదారు కాదు, ఆయన జిల్లా నుంచి వచ్చిన మంత్రి. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత ఆయనదే” అని అన్నారు.

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం ఈ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్ 29గా నిర్ణయించారు. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో 2025 ఏడాదికి సంబంధించిన తొలి విడత టెట్ నోటిఫికేషన్‌ను జూన్‌లో విడుదల చేయగా, పరీక్షలు పూర్తి చేసి జూలై 22న ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు రెండో విడత టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాల్సిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కొనసాగించాలంటే తప్పనిసరిగా ఈ టెట్ పరీక్షను ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

మహిళా ఉగ్ర డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం..

ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక విషయం తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న మహిళా డాక్టర్ షాహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఢీ కొట్టాడు. ఈ ఉగ్రదాడిలో 40 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ చీప్ మసూద్ అజర్ మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ మరణించాడు. ఈ ఉమర్ ఫరూక్ భార్యనే అఫిరా బీబీ.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో డిలే అవుతూ వచ్చింది. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే డౌట్లు అందరికీ మొదలయ్యాయి. తరచూ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. ఈ రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా సందీప్ రెడ్డి వంగా మూవీ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. జిగ్రీస్ మూవీ సక్సెస్ ఈవెంట్ కు వచ్చిన సందీప్ రెడ్డికి స్పిరిట్ గురించి ప్రశ్నలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మూవీపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు స్పిరిట్ ఇంకా లేటవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ స్పిరిట్ ఈ నెలాఖరుకు స్టార్ట్ అవుతుందని సందీప్ ఈవెంట్ లో స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

రేపే కౌంటింగ్.. ఏర్పాట్లు ఇలా..!

రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ కోసం యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠకు తెరపడనుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా ఎన్నికల సంఘం అధికారులు పూర్తి చేయడంతో పాటు కౌంటింగ్ సెంటర్‌లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. కేంద్ర బలగాలతో పాటు మూడంచేలా పోలీసులతో పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేసారు. కేవలం అనుమతి పొందిన వారు మినహా ఎవ్వరికి కౌంటింగ్ హాల్లోకి అనుమతి కి లేదని తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్..

అమెరికాకు రండి, మా వాళ్లకు శిక్షణ ఇవ్వండి, తిరిగి సొంత దేశానికి వెళ్లండి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. H-1B వీసాలపై అమెరికా ఏ కఠిన నిర్ణయం తీసుకున్నా, ఇది భారతీయులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీసాల కింద అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కొత్త విధానానికి రెడీ అవుతున్నాడు. విదేశీ వర్కర్లపై ఎక్కువగా ఆధారపడకుండా, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం అమెరికన్లకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ నిపుణుల్ని కొంత కాలం పాటు అమెరికాలోకి అనుమతించేందుకు సిద్ధమైనట్లు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. అమెరికాలో కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. దీని ప్రకారం, కొత్త H-1B వీసా విధానంలో విదేశీ నిపుణులు ముందుగా అమెరికాకు వచ్చి, అక్కడి స్థానికులకు శిక్షణ ఇచ్చి, మళ్లీ తిరిగి సొంతదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి మూడు, ఐదు లేదా ఏడు ఏళ్లు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల్ని అమెరికాలోకి అనుమతించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది.

‘‘అలా జరిగితే, బీహార్‌లో నేపాల్ తరహా అల్లర్లు’’.. కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత హెచ్చరిక..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తం ఆసక్తి నెలకొంది. రేపు (నవంబర్ 14)న కౌంటిక్ జరగబోతోంది. బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనా?, మహాఘట్బంధన్ కూటమా? అనేది రేపటితో తేలబోతోంది. అయితే, కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఎన్నికల అధికారుల్ని హెచ్చరించారు.

ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు ప్రజా తీర్పును దెబ్బ తీయవద్దని, అలా చేస్తే బీహార్‌లో అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. తమ పార్టీ అప్రమత్తంగా ఉందని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని సింగ్ కోరారు. 2020లో మా ఆర్జేడీ అభ్యర్థుల్లో చాలా మంది బలవంతంగా ఓడిపోయారని, ప్రజలు ఓట్లేసి గెలిపించాలనుకున్న వ్యక్తిని ఓడిస్తే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలకం తరహాలో రోడ్లపై పెద్ద ఎత్తున నిరసనలు కనిపిస్తాయని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారుల్ని హెచ్చిరించారు.

కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగార్జున

మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరిగింది.

సుప్రీంకోర్టులో సోమవారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత ఘట్టం మొదలైంది.. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును, శాసనసభ పటిష్టతను ప్రభావితం చేయనుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో కీలక పార్టీ అయిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావన కూడా ఉండడం, ఈ విచారణకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

 

Exit mobile version