PCC చీఫ్‌కు ఫిర్యాదు.. క్లారిటీ ఇచ్చిన సీతక్క
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ విషయమై పీసీసీ చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో, ఆ వార్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. “మేడారం ఆలయ అభివృద్ధి మనందరి బాధ్యత. అక్కడ జరిగే పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, సజావుగా పూర్తి కావాలని మాత్రమే కోరాను,” అని సీతక్క పేర్కొన్నారు. అదేవిధంగా, ఈ సున్నితమైన అంశంపై ఎలాంటి వివాదం లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను అభ్యర్థించినట్లు చెప్పారు.
లాలూ కుటుంబంలో ముదిరిన వివాదం..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. లాలూ కుటుంబంలో తీవ్ర విభేదాలు ముసురుకున్నాయి. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ , తన అక్క మీసా భారతిలను ఎక్స్‌లో అన్‌ఫాలో చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ చర్య కుటుంబంలో చీలిక గురించి కొత్త ఊహాగానాలకు దారి తీసింది.
యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ దాడి…ఎందుకంటే…
మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ చెప్పుతో దాడి చేసింది. పైగా స్కూల్ ని వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావంటూ అతడిపై తిరగబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లాలో వింతగా ప్రవర్తించింది ప్రిన్సిపాల్. హినోటి ఆజం ప్రాథమిక పాఠశాల హెడ్‌గా ఉన్న సోనా మారవి.. ఓ మేల్ యూట్యూబర్‌ను చెప్పుతో కొట్టింది. యూట్యూబర్ పాఠశాలలో ఉన్న సౌకర్యాల గురించి ప్రశ్నించడంతో అతడిపై దాడికి తెగబడింది. ముందుగా స్కూల్‌లోకి ఎంటర్ అయిన యూట్యూబర్.. గేట్, స్కూల్ బయట, లోపల చిత్రీకరించాడు. తను చూసిన సమస్యల గురించి అడిగాడు. దీంతో కోపంతో వెంటనే చెప్పు తీసిన ఆమె.. యూట్యూబర్ పై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి ఇలా దిగజారి ప్రవర్తించడమేంటని తిట్టి పోస్తున్నారు. ఆమెపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
హసీనా బంగ్లాదేశ్‌కు వస్తుందని యూనస్‌లో ఆందోళన..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అవకాశం గురించి తాను ఆందోళన చెందుతున్నాని అన్నారు. హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి బాహ్య శక్తులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని యూనస్ అన్నారు.
ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కె ర్యాంప్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫుల్ బోల్డ్ ట్రాక్ లో వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో లిప్ లాక్ లు, బూతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరంకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్టార్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సాధ్యమే అంటారా అని ప్రశ్నించింది ఓ లేడీ రిపోర్టర్.
ముద్దులతో రెచ్చిపోయిన మాజీ ప్రధాని.. గర్ల్ ఫ్రెండ్‌తో..
కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వార్తల్లోకి ఎక్కారు. ఆయన కొంతకాలంగా గాయని కేటీ పెర్రీతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి పుకార్లు కావని వారి మధ్య సంబంధాన్ని ఒక ఫోటో బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. వారిద్దరూ ఒక పడవలో ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వైరల్ ఫోటోలలో ట్రూడో చొక్కా లేకుండా కేటీ పెర్రీని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
స్మృతి మంధాన రికార్డ్.. 5 వేల పరుగులు పూర్తి
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు
విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం చేస్తున్నారు,” అని తెలిపారు.
హాస్టల్ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్‌లో చర్చించారా.? కనీసం సబ్ కమిటీ వేశారా.?
శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆపేశారని అప్పలరాజు చెప్పారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్‌లు కూడా సేవలను నిలిపివేశాయన్నారు. అదనంగా, ఈ హాస్పిటల్‌లకు ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 110 సీట్లలో పోటీ చేసింది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరుగుతాయి మరియు ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. మరోవైపు, మహాఘటబంధన్(ఆర్జేడీ- కాంగ్రెస్- వామపక్షాలు)ల కూటమిలో ఇంకా సీట్ల లెక్కలు పూర్తి కాలేదు.
