అల్లర్లు లేవు.. అంతా బాగానే ఉంది.. బాబ్రీ మసీదుపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో “అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది” అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో నెలకొన్న శాంతి- భద్రతలు గతంలో ఉన్న అస్థిరతతో పోల్చితే పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. బలమైన పోలీసింగ్ వ్యవస్థ, బాధ్యతాయుత ప్రభుత్వంతో ప్రజల భద్రతపై నమ్మకాన్ని పెంచినట్లు తెలిపారు. ఇక, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన రాష్ట్ర రాజకీయ, సామాజిక దృశ్యాన్ని పూర్తిగా మార్చివేశాయని తెలిపారు. సుప్రీంకోర్టు 2019 తీర్పుతో రామ్ మందిర నిర్మాణానికి మార్గం సుగమమై, 2024 జనవరి 22వ తేదీన జరిగిన ప్రతిష్టాపన తన జీవితంలో మర్చిపోని క్షణమని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
వన్డేల్లో తొలి సెంచరీతో చెలరేగి.. శతకాల ఖాతా ఓపెన్ చేసిన జైస్వాల్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతోంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించింది.
ప్రపంచ కుబేరుడి సంస్థకు రూ.1080 కోట్ల జరిమానా.. కారణం ఇదే !
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై యూరోపియన్ యూనియన్ (EU) రూ.1080 కోట్ల జరిమానా విధించింది. డిజిటల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈయూ ఈ చర్య తీసుకుంది. EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ను ఉల్లంఘించినందుకు X కు 120 మిలియన్ యూరోలు లేదా సుమారు రూ.1,080 కోట్లు జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. X ప్లాట్‌ఫామ్ పారదర్శకత, వినియోగదారు రక్షణకు సంబంధించిన మూడు కీలక నియమాలను ఉల్లంఘించింది, ఇది బ్లూ టిక్ మార్క్, ప్రకటనల డేటాబేస్ విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించి ఉండవచ్చని అని ఈయూ పేర్కొంది.
దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఆవిష్కరణ!
సినీ లవర్స్‌కి, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి గుడ్ న్యూస్. అల్లు సినిమాస్ వాళ్లు హైదరాబాద్‌లో ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా (DOLBY CINEMA) స్క్రీన్‌ను ఓపెన్ చేయబోతున్నారు. ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా, సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశంతో ఈ భారీ తెరను తీసుకొస్తున్నారు. మరి ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సినిమా ఏదో తెలుసా? ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. ఆ సినిమాతోనే ఈ కొత్త డాల్బీ స్క్రీన్ స్టార్ట్ కాబోతుందట! ఈ స్క్రీన్ మామూలుగా ఉండదు. దీని వెడల్పు ఏకంగా 75 అడుగులు (75 ft-wide) ఉంటుందట. DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో డిజైన్ చేశారు. విజువల్స్ అయితే మెంటల్ మాస్ అంతే. దీనికోసం టాప్ క్లాస్ #DolbyVision తో పాటు, 3D ఎక్స్‌పీరియన్స్ కోసం #Dolby3D టెక్నాలజీ వాడుతున్నారట. సౌండ్ గురించి చెప్పాలంటే, DolbyAtmos సౌండ్ సిస్టమ్ యాడ్ చేశారు. ఇది ఆడియన్స్‌ను సినిమా లోపలికి లాక్కెళ్లినంత ఫీలింగ్ ఇస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా, హాయిగా సినిమా చూసేందుకు వీలుగా, థియేటర్‌లో ‘పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్’ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద, సినిమా చూసే అనుభవాన్ని ఇది మరో లెవల్‌కు తీసుకెళ్లడం పక్కా. దీంతో ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
“కాంగ్రెస్ పుండుపై కారం”.. పుతిన్ డిన్నర్‌పై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పుతిన్‌తో డిన్నర్ జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ స్టేట్ డిన్నర్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. వీరిద్దర్ని ఆహ్వానించకుండా శశిథరూర్‌ను పిలవడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.
కళ్లుచెదిరేలా ఏర్పాట్లు.. ఎన్నో స్పెషల్ ఎట్రాక్షన్స్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ హంగులు ఓ వైపు, తెలంగాణ ప్రత్యేక ఎట్రాక్షన్స్ మేళవింపుతో మరో వైపు జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక.. ఇలా అన్ని చోట్లా హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు , ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండగ వాతావరణం సృష్టించనున్నారు.
రాష్ట్రంలో లేడీ డాన్స్ పెరిగిపోయారు.. వారి తోకలు కట్ చేస్తాం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవు.. గత ప్రభుత్వం ప్రశాంతమైన ప్రాంతాలను కూడా నేరమయం చేసింది.. నేరస్తులను పెంచి పోషించారు.. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా?.. ఇటువంటి సంస్కృతికి కారణం ఎవరు? అని అడిగారు. విజయనగరం, నెల్లూరు లాంటి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేవి.. ఈ జిల్లాలకు ఎలాంటి అధికారులను ఎస్పీలుగా నియమించినా సరిపోయేది.. కానీ, గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్తులు తయారయ్యారు.. నెల్లూరు లాంటి జిల్లాలో లేడీ డాన్లను తయారు చేశారంటే.. గత ఐదేళ్లు ఎలాంటి పాలన సాగిందో అర్థం చేసుకోవాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఐ-బొమ్మ రవి అరెస్టుతో పైరసీకి ముగింపు పడినట్టేనా.?
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన తర్వాత, అసలు సినీ పరిశ్రమలో పైరసీ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా అనే అంశంపై హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కీలక విషయాలను వెల్లడించారు. తాము ఈ కేసును ఛేదించినప్పటికీ, పైరసీపై ఇంకా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘ఐ-బొమ్మ రవిని పట్టుకుంటే పైరసీ మొత్తం ఆగిపోతుందని అనుకోవచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కమిషనర్ స్పందిస్తూ… “ఐ-బొమ్మ అనేది సముద్రంలో ఒక బిందువు మాత్రమే” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు అయినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, ఇంకా చాలా మంది వ్యక్తులు, సంస్థలు ఈ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్ నుంచి దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. పండుగలు, సెలవుల కారణంగా రైల్వేల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. అలాగే, ఈ నెల 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు మరో ప్రత్యేక రైలును నడపనున్నారు. చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైలు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్ తదితర స్టేషన్లలో ఆగుతూ చివరకు రేణిగుంట చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా, చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ప్రత్యేక రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు వంటి ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయంతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ వివరించారు. పెరిగిన ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా అవసరమైన సమయాల్లో నడపనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు. అలాగే జనవరి 3 నుంచి 7 వరకు ఒక్కో పేపర్‌కు రూ.50 ఫైన్‌తో ఫీజు చెల్లించే సదుపాయం ఉన్నట్లు చెప్పారు. తత్కాల్ కేటగిరీలో జనవరి 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి/ఏప్రిల్–2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించినట్లు టాస్ అధికారులు వెల్లడించారు.
