Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చాట్ జీపీటీ, గ్రోక్, జెమిని, ఇతర AI చాట్‌బాట్‌లను.. అడగకూడని విషయాలు ఇవే

ChatGPT, Grok, Google Gemini వంటి AI చాట్‌బాట్‌ల వినియోగం పెరిగింది. పలు రంగాల్లోని వ్యక్తులు, విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. నిపుణులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ టూల్స్ రాయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా విషయం గురించి వాస్తవాలను త్వరగా వెతకడానికి ఉపయోగపడతాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే, AIని అడగడానికి ప్రతి ప్రశ్న సురక్షితం కాదు. మీరు మీ గోప్యత, భద్రత, మంచి నిర్ణయాలు తీసుకోవడం గురించి శ్రద్ధ వహిస్తారా అయితే AI చాట్‌బాట్‌లను అడగకూడని ఈ విషయాల గురించి తెలుసుకుందాం.

తిరుపతి అంటే నాకు సెంటిమెంట్‌: అనిల్ రావిపూడి

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్‌ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్‌” అని చెప్పారు.

పాకిస్తాన్‌ను కుదిపేస్తున్న కొత్త సంక్షోభం..

పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది. హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే 2024–25 ప్రకారం.. ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణ లోపాలు గృహ ప్రాధాన్యతల్ని తగ్గిస్తున్నాయి. స్థిరమైన ధరల ఒత్తిళ్లు, విద్యుత్, గ్యాస్ ఛార్జీల పెరుగుదల, జీవన వ్యయం భారీగా పెరగడం మొత్తంగా పాక్ ప్రజల్ని జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆదాయం పెరిగినప్పటికీ, ఆదాయాన్ని మించిన వేగంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..

ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ క్రిస్ట్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి చెందింది. త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపిక ను ఆయుష్ ఆసుపతిలో డిసెంబర్ 31న చేర్చారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 31న స్థానిక ఆయుష్ ఆసుపత్రిలో చేరిన సత్య గీతిక ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని సత్య గీతిక సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్ పీడీ గా పనిచేస్తున్నారు.

ట్రంప్ చేసినట్లు పుతిన్, జిన్‌పింగ్ చేస్తే ఎలా? వెనిజులా దాడిపై రో ఖన్నా ఫైర్..

అమెరికా, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి యూఎస్‌కు తీసుకువచ్చారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరాకు కారణమవుతున్నాడని, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని మదురోపై కేసులు మోపబడ్డాయి. అయితే, ట్రంప్ చర్యల్ని పలు దేశాలు ఖండిస్తున్నాయి. రష్యా, చైనా, ఇరాన్, క్యూబా, కొలంబియా వంటి దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సొంత దేశంలో కూడా ట్రంప్ తీరును ప్రతిపక్ష డెమోక్రాట్లు ఖండిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ ట్రంప్ చర్యల్ని తప్పుపట్టారు. ఇదిలా ఉంటే, భారత సంతతికి చెందిన అమెరికా శాసనసభ్యుడు రో ఖన్నా కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం, యుద్ధాలను సాధారణీకరించడం ద్వారా అమెరికా ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృ‌ష్టించిందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయాన్ని విమర్శి్స్తూ.. రష్యా, చైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెరికా ఎలా స్పందిస్తుందని ప్రశ్నించారు. ఈ దాడి ఎంపిక చేసుకున్న యుద్ధమని వర్ణించారు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేసి జెలెన్స్కీని బంధిస్తే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా ఏం చెబుతుంది?? అని ప్రశ్నించారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య దాని నైతిక అధికారాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ స్పీచ్‌కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది ..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, అవినీతిని ముఖ్యమంత్రి ఎండగట్టడంతో కేటీఆర్, హరీష్ రావులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిని ఉరి తీయాలని అనడం కేటీఆర్ నీచ మనస్తత్వానికి, విశ్వాసఘాతకానికి నిదర్శనం. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం నీది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిని ఉరి తీసినా తప్పులేదని రేవంత్ రెడ్డి అన్నది కేవలం అవినీతి తీవ్రతను చెప్పడానికే తప్ప, ఎవరి చావును కోరుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!

విద్యార్థులను ఉచితంగా టాబ్లెట్లు అందజేస్తున్నారు. మీకు తెలుసా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి కొత్త పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులను చదువుతో పాటు సాంకేతికతతో అనుసంధానించడం నేటి కాలంలో కీలకమైన అవసరంగా మారింది. దీనికి అనుగుణంగా, యూపీ సర్కార్ విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అందించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం. యూపీ సర్కార్ ఈ పథకం ద్వారా యువతను ఆన్‌లైన్ విద్య, డిజిటల్ నైపుణ్యాలు, కొత్త ఉపాధి అవకాశాలతో అనుసంధానించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిశక్తి పథకాన్ని స్టార్ చేసింది. డిజిటల్ ఇండియా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడం, రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, సాంకేతిక, వైద్య, నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అందించనున్నారు.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? పోలీసులకు సమాచారమివ్వండి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ పేర్కొన్నారు. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లోగానీ, బీట్‌ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సీపీ సజ్జనార్‌ ప్రజలకు హితవు పలికారు. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

అవనిగడ్డలో 45 రోజుల పసిపాప మృతి కేసును ఛేదించిన పోలీసులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

కృష్ణాజిల్లా అవనిగడ్డలో 2 రోజుల క్రితం మృతి చెందిన 45 రోజుల పసికందు మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లి పసిపాపను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పాప వైద్యానికి ఖర్చు అవుతోందని అత్త సూటి పోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైంది కన్న తల్లి. తన బిడ్డకు అనారోగ్యం నయం కాదేమో అని గుండెలవిసేలా రోదించింది. దీంతో కన్న బిడ్డను చెరువులో పడేసినట్టు పోలీసులు గుర్తించారు. పసి పాప మృతికి కారకులైన తల్లి రావి సాయి చైతన్య, నాయనమ్మ రావి వాణి లపై కేసు నమోదు చేసిన మోపిదేవి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని అవనిగడ్డ కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 14 రోజులు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పాప మేనమామ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ప్రాజెక్టుల చర్చకు బీఆర్ఎస్ ఎందుకు పారిపోతోంది.?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘జల యుద్ధం’ పీక్ స్టేజ్‌కి చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుకొని కృష్ణా జలాల కేటాయింపుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? ఎవరు వాస్తవాలను దాస్తున్నారు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఈ అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రమ్మంటే.. మైక్ ఇవ్వలేదనే చిన్న నెపంతో అసెంబ్లీని బహిష్కరించి పారిపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి?” అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టుల క్రెడిట్ విషయంలో కేసీఆర్ అండ్ టీమ్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు.

 

Exit mobile version