Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

తెలుగులో మాట్లాడి షాకిచ్చిన జపాన్ ఫ్యాన్.. అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు జపాన్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అక్కడ ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ఈ జోడి జపాన్‌లో సందడి చేసింది. ఈ పర్యటనలో ‘కజు’ అనే ఒక జపనీస్ అభిమాని అల్లు అర్జున్, రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ, అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అర్జున్ అతనితో జపనీస్‌లో మాట్లాడటానికి ప్రయత్నించగా, ఆ అభిమాని మాత్రం.. ‘మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను, దయచేసి నా తెలుగును భరించండి’ అని స్వచ్ఛమైన తెలుగులో అనడంతో బన్నీ, రష్మిక ఒక్కసారిగా అవాక్కయ్యారు.

విజయ్ దేవరకొండ ’14’ టైటిల్ ఇదే

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్‌. దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యధార్థ సంఘటనల ఆధారంగా ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఇండిపెండెన్స్ ముందు రాయలసీమ ప్రాంతాన్ని నేపథ్యంలో వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్.. ఐసీసీ వార్నింగ్‌లో జట్టు ప్రకటన..

భారత్‌లో ఆడమని ప్రకటించి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రగల్భాలు పలికింది. అయితే, టోర్నీని బాయ్‌కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగొచ్చింది. చివరకు టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించింది. ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పీసీబీ 15 మందితో జట్టును వెల్లడించింది. జట్టును ప్రకటించడం ద్వారా తాము టోర్నీ ఆడబోతున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ధ్రువీకరించారు.

ఈ ఏడాది పద్మ అవార్డులు వరించిన ప్రముఖులు వీరే!

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి రామారెడ్డికి ఈ పురస్కారం దక్కింది. కుమారస్వామి తంగరాజ్‌ సీసీఎంబీ శాస్త్రవేత్త. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై మూడు దశాబ్దాలుగా చేసిన రీసెర్చ్‌‌కు ఈ అవార్డు వరించింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఎవరెవరు అరెస్ట్‌ కాబోతున్నారు..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఘట్టానికి చేరుకుంది. సుమారు 600 పేజీల సుదీర్ఘమైన తుది ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్‌లో సమర్పించారు. ఈ సమగ్ర నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని, నిందితుల పాత్రను ఆధారాలతో సహా పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ ఉద్యోగులు , డైరీ నిపుణులు కూడా ఉండటం గమనార్హం. గతంలో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లకు అదనంగా, లోతైన విచారణ తర్వాత మరికొందరి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం.

యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?

బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ 2026 బడ్జెట్‌ను చూసే జెన్‌-జీ దృష్టి అక్కడితో ఆగడం లేదు. ఉద్యోగ భద్రత లేని ప్రపంచంలో పెరిగిన తరం ఇది. కోవిడ్‌, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, క్లైమేట్ మార్పులు అన్నింటినీ చిన్న వయసులోనే చూసింది. అందుకే ఈ తరం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. జీతం ఎంత వస్తోందన్నదాని కంటే, ఆ జీతంతో జీవించగలుగుతున్నామా? మానసిక ఆరోగ్యానికి భద్రత ఉందా? చదువు ఉద్యోగంగా మారుతోందా? మహిళలకు ప్రాథమిక అవసరాలు అందుబాటులో ఉన్నాయా? నగరాల్లో బతకడం ఎందుకు ఇంత ఖరీదయ్యింది? పర్యావరణం విషయంలో మాటలు కాదు, చర్యలు ఎప్పుడు కనిపిస్తాయి? ఇటు డిలాయిట్ సర్వేలు చెబుతున్న గణాంకాలు, యువత అనుభవిస్తున్న ఒత్తిడి, ఆందోళనలు ఒకటే చెబుతున్నాయి. జెన్‌-జీకి బడ్జెట్ అంటే ఇక కేవలం ట్యాక్స్ స్లాబ్స్ కాదు. అది జీవన నాణ్యతపై ఒక పరీక్ష. ఆరోగ్యం నుంచి చదువు వరకు, పన్నుల నుంచి పర్యావరణం వరకు ప్రభుత్వం తమ భవిష్యత్తును ఎలా చూస్తుందో తెలుసుకునే క్షణం. ఇంతకీ 2026 బడ్జెట్ నుంచి జెన్‌-జీ నిజంగా ఏం ఆశిస్తోంది?

‘‘తలవంచేది లేదు, ఒంటరిగా గెలుస్తాం’’.. టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు..

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్, సినీ నటుడు విజయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఆయన చివరి సినిమాగా చెప్పబడుతున్న ‘‘జన నాయగన్’’ విడుదల కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ పరిణామాల తర్వాత తొలిసారిగా విజయ్ తన పార్టీ టీవీకే సమావేశానికి హాజరయ్యారు. 3000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యకర్తలతో మామల్లపురంలో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను ‘‘ఒత్తిడికి లొంగిపోవనని’’, ‘‘తలవంచనని’’ అన్నారు.

ఆర్జేడీలో లాలూ వారసుడికి కీలక బాధ్యతలు..

రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కి ఇప్పుడు కొత్త చీఫ్ వచ్చారు. లాలూ వారసుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను తాజాగా పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పార్టీ ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యింది. “నూతన యుగం ప్రారంభం. రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు” అని పార్టీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.

“15 నిమిషాలే టైమ్ ఇచ్చారు, లేదంటే చంపేస్తామన్నారు”.. యూఎస్ దాడిపై వెనిజులా ప్రెసిడెంట్..

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికా దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్న ఈ ఆపరేషన్‌ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికన్ దళాలు తమ మంత్రి వర్గ సభ్యులు అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటారా? లేదా చంపేయమంటారా.? అని నిర్ణయం తీసుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇచ్చారని అన్నారు.

 

Exit mobile version