Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఖమేనీ దిగిపోయే సమయం వచ్చింది.. ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్..

ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు. ఖమేనీ తన 37 ఏళ్ల పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. రెండు రోజు క్రితం 800 మందికి పైగా ప్రజల్ని ఉరి శిక్షల్ని ఆపరడం ఆయన తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని ట్రంప్ అన్నారు. దేశాన్ని నడిపించడానికి ఇరాన్ నాయకత్వం అణిచివేత, హింసపై ఆధారపడుతోందని ట్రంప్ వాదించారు. దేశాన్ని పూర్తిగా నాశనం చేశాడని ఖమేనీని విమర్శించారు. దేశాన్ని సరిగా పాలించడం చేతకాక, అధికారంలో ఉండేందుకు వేల మందిని హతమార్చడం నాయకత్వం కాదని, నాయకత్వం అంటే గౌరవం, భయం, మరణం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖమేనీని ‘‘రోగిష్టి వ్యక్తి’’గా అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్ మతపాలన దేశాన్ని నివసించడానికి అత్యంత దారుణమైన ప్రాంతంగా మార్చిందని అన్నారు.

పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పాలనకు నిజమైన అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ నిరంతరం పోరాటం చేశారని, పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అలాగే టీటీడీలో అన్నదాన పథకం ఒక గొప్ప సామాజిక మార్పుకు నాంది పలికిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని తెలిపారు.

ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. ఆ ఛానెల్‌ కథనంపై భట్టి విక్రమార్క ఫైర్..

బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తన పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారన్నారు.. ఒక లక్ష్యం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆస్తులు సంపాదించేందుకు, హోదా అనుభవించేందుకు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.. ఆస్తులను, వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. తన జీవితం పూర్తి పారదర్శకంగా ఉంటుందని.. ఏ మాత్రం జ్ఞానం లేకుండా మీకు తోచింది రాయడం సరికాదన్నారు.. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ.. టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ, మంత్రి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి ఫీల్డ్ విసిట్ పెడతారని చెప్పారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇలాంటి నిబంధనలు పెడతారని.. రాయడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలని వెల్లడించారు. “టెండర్లు పిలిచింది సింగరేణి బోర్డు.. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. సైట్ విజిటింగ్ పెట్టారు అన్నావు, సైట్ విజిటింగ్ అనేది కండిషన్‌లో భాగం.. విజిట్ చేయడం పబ్లిక్ అంశంలో కామన్.. టెండర్లు రద్దు చేయమని సింగరేణి బోర్డును ఆదేశించాను, కొత్త టెండర్లు పిలవమని చెప్పాను.. కట్టు కథలు అల్లి కథనం రాశారు.. రాసిన ఆయనకు ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు.. వైఎస్ మీద కోపంతో నామీద రాసి ఉంటాడు.. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్రజలకు నిజాలు తెలియాలి.. వెనకాల ఎవరు ఉండి రాయించారో తర్వాత మాట్లాడతా.” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

చేసింది 9 సినిమాలు.. తన బెస్ట్ సినిమా ఏదో చెప్పిన అనిల్ రావిపూడి

టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇక మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విక్టరీ వెంకటేష్ తో F2, F3తో వరుస ప్లాప్స్ లో ఉన్న వెంకీకి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. దాంతో సీనియర్ హీరోలను అనిల్ రావిపూడి బాగా చూపిస్తాడు అనే నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను డైరెక్ట్ చేసాడు అనిల్. కెరీర్ లో మొదటి సారి తన కామెడీ ట్రాక్ ను పక్కన పెట్టి బానావో భేటికో షేర్ అనే కాన్సెప్ట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అనిల్ బాగా డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో ఏకంగా జాతీయ బెస్ట్ ఫిల్మ్ గా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరుతో మనశంకరవరప్రసాద్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు. కెరీర్ లో ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ‘ తన కెరీర్ లో బాగా ఇష్టమైన సినిమా అంటే బాలయ్యతో చేసిన ‘భగవంత్ కేసరి’ అని ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావడం చాలా హ్యాపీగా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!

ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో హద్దులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా పేరిట వ్యక్తిగత అజెండాలతో, రాజకీయ బ్రోకరిజానికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిరోజూ హద్దులు దాటి ప్రవర్తిస్తూ, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన థంబ్‌ నెయిల్స్‌ తో ప్రజల్లో మీడియాపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లకన్నా కూడా ఆంధ్రజ్యోతి స్థాయి దిగజారిందని వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలు, కోడిపందేలు వంటి అంశాలపై ఒక పక్షపాతంతో కథనాలు రాస్తూ.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సాంప్రదాయాన్ని ‘సుప్పిని శుద్దపూస’ లెక్క మహిళలపై, రాజకీయ నాయకుల కుటుంబాలపై, చివరకు దేవుళ్లపైనా అభ్యంతరకరమైన రాతలు, చిత్రాలను ప్రచురించడం మీడియా విలువలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి ధోరణి వల్లే తెలుగు మీడియా విశ్వసనీయత దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

ఎవరి కోసమో నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదు..

ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని స్పష్టం చేశారు.. మీకు, ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు.. మీ మధ్యలోకి ప్రజా ప్రతినిధులను లాగొద్దని తెలిపారు.. మీడియా సంస్థల మధ్య ఇంట్రెస్ట్, పంచాయతీ మీరే చూసుకోవాలన్నారు.. మంత్రుల మధ్య పంచాయతీ పెడతాం అంటే కుదరదని.. తాము ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నామని.. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ఏ ఛానెల్ అయినా ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దని చెప్పారు.. సీఎం, మంత్రులు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం.. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు మమ్మల్ని ఏం చేయలేవన్నారు.. నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు.. ఎవరి కోసమో నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదని పేర్కొన్నారు.

పైసా గ్యారెంటీ లేకుండా రూ.20 లక్షల రుణం.. అవకాశం మిస్ అవ్వకండి!

ఈ రోజుల్లో పైసా గ్యారెంటీ లేకుండా సొంత వాళ్లే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్న విషయం మీకు తెలుసా.. ఇది నిజంగా నిజమైన వార్త. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఇంతకీ ఈ రుణం ఇచ్చేది ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం యువతకు, వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తోంది. ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఈ రుణానికి ఎటువంటి హామీ అవసరం లేదు. ఇది పూర్తిగా పూచీకత్తు లేని రుణం. నిజానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ పథకం గతంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రుణాలను అందించింది. కానీ ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. FY2024-25 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఇంతకీ ఈ ప్రభుత్వ పథకం పేరు ఏంటో తెలుసా.. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఈ ప్రభుత్వ పథకం నాలుగు కేటగిరిల్లో వ్యాపారాలకు రుణాలు అందిస్తుంది. తద్వారా వారు కాలక్రమేణా తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. శిశు కేటగిరీ కింద రూ.50,000 రుణం, కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణం అందజేస్తారు.

బొగ్గు మాయమైందని ప్రచారం చేస్తున్నారు.. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు!

సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాము. ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదు. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించి మారీచుడు, సుబాహుడు బలపడేందుకు సహకరిస్తున్నారు. మీకు మీకు మీడియా పంచాయితీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి. అంతేకానీ అందులోకి మమ్మల్ని లాగొద్దు. మంత్రులను బద్నాం చేయొద్దు. మా మంత్రులపై వార్తలు రాసేముందు నా దగ్గర వివరణ తీసుకోండి. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటా. మా మంత్రులపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది. నా నాయకత్వం పట్ల అపోహలు సృష్టిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్‌ లేదు’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఆదివాసీల ఆత్మగౌరవ శిఖరం..కేస్లాపూర్‌లో ప్రారంభమైన చారిత్రక ఉత్సవం.!

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపూర్ గ్రామం మరోసారి భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరొందిన ‘నాగోబా జాతర’ 2026 జనవరి 18న అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు , వారి జీవన వైవిధ్యానికి అద్దం పట్టే ఒక గొప్ప వేదిక. ఈ జాతర ముఖ్యంగా మెస్రం వంశీయుల ఆచారాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, ఇక్కడ వారు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను (శేషనాయుడు) భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

 

Exit mobile version