నిన్న తిరుమల శ్రీవారిని 18010 మంది భక్తులు దర్శించుకున్నారు. 8652 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.77 కోట్లుగా ఉంది. అయితే రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇక 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం చేయనున్నారు. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. అలాగే 30,31వ తేదిలలో హనుమజన్మస్థలం అంశం పై టీటీడీ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతులు, పరిశోధకులు పాల్గోనున్నారు.