NTV Telugu Site icon

Tomato Prices Drop: దారుణంగా పడిపోయిన టమోటా ధర.. రైతుల లబోదిబో..

Tomato

Tomato

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.. దీంతో. లబోదిబోమంటున్నారు రైతులు. అధిక వర్షాల వల్ల టమోటా బాగా దెబ్బతినడంతో రైతులు బాగా నష్టపోతున్నారు.. ఉన్న కాస్త పంట కూడా చేతికి వచ్చి మార్కెట్ కి తీసుకెళ్తే.. కిలో 4 రూపాయలు కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికేర ఆస్పరి దేవనకొండ మండలాల నుండి టమోటాను మార్కెట్ కు తరలిస్తుంటారు రైతులు.. రెండు రోజుల నుండి మార్కెట్ కు 20 టన్నుల వరకు సరుకు వస్తుందని వ్యాపారులు అంటున్నారు. గత కొద్దిరోజుల్లో మార్కెట్ సరుకు తక్కువగా వస్తున్నా.. రేటు పలకడం లేదని, వ్యాపారస్తులు.. దళారులు కుమ్మక్కై టమోటా రైతులు దెబ్బతిస్తున్నారని.. ప్రభుత్వమే చొరవ చూపి రైతులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు రైతులు… టమోటా రైతులకు కూలీలు ,రవాణా చార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మార్కెట్‌లో దళారులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Read Also: Vishnuvardhan Reddy: 2024లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..! మళ్లీ మోడీయే ప్రధాని..