Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు

  • కిలో రూ.100 నుంచి రూ.10కి పడిపోయిన టమాటా ధర
  • మదనపల్లి, అనంతపురం మార్కెట్లలో రైతుల ఆవేదన
  • క్రేట్‌కు రూ.150 కూడా రాక నష్టాల్లో సాగుదారులు
  • మద్దతు ధర, కోల్డ్ స్టోరేజ్ కల్పించాలని డిమాండ్
Tomato

Tomato

Tomato market price today : గత కొన్ని వారాల క్రితం ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు అమాంతం నేలకు దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించినప్పటికీ, పండించిన రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏపీ , తెలంగాణలోని మదనపల్లి, అనంతపురం, వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో కేజీ 80 నుండి 100 రూపాయల వరకు పలికిన ధర, ఇప్పుడు కేవలం 5 నుండి 10 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లకు భారీగా టమాటా నిల్వలు పోటెత్తడం, దిగుబడి పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..

టమాటాను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి, కోత కోయడానికి అయ్యే కూలీ ఖర్చులు, , మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక క్రేట్ (సుమారు 25-30 కేజీలు) టమాటా ధర కేవలం 100 నుండి 150 రూపాయలకే పలుకుతుండటంతో, గిట్టుబాటు ధర లేక రైతులు హతాశులవుతున్నారు. తమ కష్టార్జితానికి తగిన విలువ దక్కకపోవడంతో కొందరు రైతులు ఆగ్రహంతో టమాటాలను రోడ్లపైనే పారబోస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో, వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని లేదా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టమాటా ధరలు తగ్గడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్‌లో తక్కువ ధరకు టమాటా లభిస్తుండటంతో కొనుగోళ్లు పెరిగాయి. అయితే, వినియోగదారులకు లాభం చేకూరినప్పటికీ, పండించిన రైతు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ