Site icon NTV Telugu

Today Ntv Top News

1 ఏపీలో వినోదం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టికెట్ల రేట్లపై హేతుబద్ధత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఏర్పాటుచేసింది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ సీఎం జగన్‌ తో చర్చించిన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌ లో వివరించారు మంత్రి పేర్ని నాని.

https://ntvtelugu.com/perni-nani-hot-comments-on-pawan-kalyan/

2.ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది సీఎం కేసీఆర్‌ 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ సూచించారు.

https://ntvtelugu.com/cm-kcr-birthday-celebrations-for-three-days-in-telangana/

3.తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాను డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్‌.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.

https://ntvtelugu.com/tpcc-chief-revanth-reddy-targets-cm-kcr/

4.బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.

https://ntvtelugu.com/ashwinikumar-fires-on-trs-ministers/

5.ర‌ష్యా- ఉక్రెయిన్ వ్య‌వ‌హారం చిలికిచిలికి గాలివాన‌లా మారేలా క‌నిపిస్తున్న‌ది. ఇప్ప‌టికే నాటో, అమెరికా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున మొహ‌రిస్తున్నాయి. నాటో ద‌ళాల‌కు అండ‌గా ఉండేందుకు మాత్ర‌మే త‌మ ద‌ళాల‌ను పంపుతున్న‌ట్లు అమెరికా చెబుతున్నది. ఫిబ్ర‌వ‌రి 16 వ తేదీన ఉక్రెయిన్ పై దాడికి దిగేందుకు ర‌ష్యా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌ని అమెరికా వాదిస్తున్న‌ది. 

https://ntvtelugu.com/russian-warship-chases-off-us-submarine-near-pacific-islands/

6.సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా మొదటి పాట కళావతి సోషల్ మీడియాలో లీకైన విషయం తెల్సిందే. ఆరు నెలలు ఎంతో కష్టపడి చేసిన సాంగ్ ని చాలా ఈజీ గా నెట్లో పట్టేసాడు.. హృదయం ముక్కలయ్యింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ అయినా సంగతి తెలిసిందే. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన మేకర్స్.. ఈ సాంగ్ అనుకున్న సమయానికంటే ముందుగానే రిలీజ్ చేసి అభిమానుల కోపాన్ని తగ్గించారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే కళావతి సాంగ్ ని రిలీజ్ చేశారు.

https://ntvtelugu.com/sarkaru-vaari-paata-first-single-out-now/

7.ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవ‌రైనా పార్కుల్లో జంట‌లుగా క‌నిపిస్తే.. చిత‌క్కొడ‌తామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సంద‌ర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో క‌ర్రలను చేత‌బూని తిరుగుతామ‌ని, ఏ జంట‌లైనా క‌నిపించాయో.. వారికి అక్కడిక‌క్కడే పెళ్లి చేసేస్తామ‌ని శివ‌సేన కార్యక‌ర్తలు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు భోపాల్‌లో శివసేన కార్యకర్తలు కర్రలు చేత‌బూని వాటికి కాళికా దేవి మందిరంలో పూజ‌లు కూడా నిర్వహించారు.

https://ntvtelugu.com/shiva-sena-warning-to-lovers-on-vallentines-day/

8.ఇటీవ‌ల కాలంలో గోల్డెన్ వీసా అనే ప‌దం బాగా వినిపిస్తున్న‌ది. విదేశీ పెట్టుబ‌డులు, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు యూఏఈ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వ‌చ్చింది అంటే వారు యూఏఈ పౌర‌సత్వం పొందిన‌ట్టే అనుకోవ‌చ్చు. వ్యాపార‌వేత్త‌లు, ప‌ర్యాట‌కులు, శాస్త్ర‌వేత్త‌లు, క‌ళాకారుల‌కు గోల్డెన్ వీసాను అందిస్తుంటారు. ఇలాంటి వారంద‌రికీ గోల్డెన్ వీసా అందిస్తారా అంటే లేదని చెప్పాలి. విద్యార్థుల‌కైతే ప్ర‌తిభ ఆధారంగా గోల్డెన్ వీసాల‌ను అందిస్తారు. అదే క‌ళాకారుల‌కైతే వారి రంగాల్లో ఉన్న‌త స్థాయిలో ఉండాలి. అదేవిధంగా వారు త‌ర‌చుగా యూఏఈకి ప్ర‌యాణం చేస్తుండాలి.

https://ntvtelugu.com/what-is-golden-visa/

9.బెంగ‌ళూరులో ఐపీఎల్ వేలం కొన‌సాగుతోంది. రెండోరోజు వేలంలో ఇప్పటివరకు చూసుకుంటే.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండ‌ర్ లివింగ్‌స్టోన్ అత్యధిక ధర పలికాడు. లివింగ్ స్టోన్‌ కనీస ధర రూ.కోటి కాగా… పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా అతడిని రూ.11.5 కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ హిట్టర్ కావడంతో అతడిని దక్కించుకునేందుకు పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడింది. అత‌డు బంతితోనేగాక బ్యాట్‌తోనూ ఆట‌ను మ‌లుపు తిప్పగ‌ల‌డు. 

https://ntvtelugu.com/punjab-kings-buy-liam-livingstone-for-big-price/

10.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుసులో ఏమనుకుంటుందో అది ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేస్తుంది. హీరో, హీరోయిన్, రాజకీయాలు అనే తేడా కూడా ఉండదు. ఇక తాజాగా అమ్మడు దీపికా సినిమాపై పడింది. ఇటీవల దీపికా పదుకొనే,న అనన్య, సిద్దాంత్ నటించిన ‘గెహ్రియాన్‌’ సినిమా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. ఘాటు వ్యాఖ్యలతో మరో వివాదాన్ని రెచ్చగొట్టేసింది.

https://ntvtelugu.com/kangana-ranaut-sensational-comments-about-deepika-movie/
Exit mobile version