Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events November 21, 2022

*నేటి నుంచి ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ సింగపూర్ పర్యటన….సౌత్ ఈస్ట్ ఏషియా పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గోనున్న మంత్రి…రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చర్చించనున్న మంత్రి

*పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ అరెస్టు

* ఖతార్ లో FIFA ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గ్రూప్ బీలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇరాన్, గ్రూప్ ఏలో సెనెగల్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్

*విశాఖపట్నంలో దసపల్ల భూముల పరిరక్షణ కోసం కలెక్టరేట్ దగ్గర జనసేన నిరసన

*విశాఖపట్నంలో నేటి నుంచి TNSF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ”సంక్షేమ హాస్టల్ పోరు బాట” సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసనలు

*కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న స్నానఘట్టాలు

*అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించనున్న మంత్రి చెల్లుబోయిన వేణు

*పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సిఎం జగన్ పర్యటన..రూ.2వేల 437 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

*అన్నవరంలో జనసంద్రంగా మారిన సత్యదేవుని ఆలయం.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి దర్శనానికి అనుమతి

* ఏపీలో ఈనెల 21 నుంచి సర్కారు బడుల్లో కొత్త మెనూ.. విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన భోజనం

Exit mobile version