NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events January 31, 2023

* ఈరోజు నుంచి యాదాద్రి ఆలయం కు అనుబంధ ఆలయమైన పాత గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

*నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

*నేడు నిర్మల్ లో ధర్నా కు పిలుపు నిచ్చిన బీజేపీ.. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం మున్సిపల్ తీర్మానం చేయాలని డిమాండ్

*గుంటూరు లో నేడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నూతన భవనాన్ని ప్రారంభించనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని , హాజరు కానున్న పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

* విశాఖలో నేటితో ముగియనున్న విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు..ముగింపు కార్యక్రామానికి హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్.. రాజశ్యామల యాగం మహా పూర్ణాహుతికి హాజరుకానున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు

*విశాఖలో నేడు జీవీఎంసీ దగ్గర వామపక్ష పార్టీల ఆందోళన….పూర్ణమార్కెట్,ముడసర్లోవ పార్కు ప్రయివేటుకు అప్పగించాలనే ప్రతిపాదనలపై ఆగ్రహం

*3 రాజధానులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…AP హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

*విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నేడు మేయర్ విజయలక్ష్మి గారి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం

*నేడు తుని ఏరియా ఆసుపత్రి శత వార్షికోత్సవం ఉత్సవాలలో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా

*నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన…..ఆంధ్ర యూనివర్శిటీలో దక్షిణాది రాష్ట్రాల వైస్ ఛాన్సలర్ల సమావేశంలో పాల్గొననున్న గవర్నర్

*నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం.. తిలకించేందుకు లక్షలాదిగా తరలి రానున్న భక్తులు

Show comments