* నేడు కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ పర్యటన … భద్రాద్రి కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్ఎస్ భవనం ప్రారంభించనున్న సీఎం, మెడికల కళాశాల అనుబంధ భవనాలకు శంఖుస్థాపన చేయనున్న కేసీఆర్
* ఈ నెల 28వ తేదిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. రథసప్తమి వేడుకల నిర్వహణపై ఇవాళ అధికారులుతో ఇఓ ధర్మారెడ్డి సమీక్ష
* సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విశాఖలో కొనసాగుతున్న రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్
*నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామివారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు
* ఇవాళ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-శ్రీలంక మధ్య రెండవ వన్డే మ్యాచ్.. మొదటి మ్యాచ్ గెలిచిన ఇండియా.. ఇవాళ్టి మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ కైవసం
* ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీచెయ్యనున్న టీటీడీ
* ఇవాళ్టి నుంచి ప్రతి గురువారం శ్రీవారికి తిరుప్పావడ సేవ పున:రుద్దరణ
*రేపటినుండి నరసరావుపేట వేదికగా పల్నాడు జిల్లా సంక్రాంతి సంబరాలు ప్రారంభం
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరణ
*స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నెల్లూరు లో బీజేవైఎం ఆధ్వర్యంలో 4 కె రన్
*శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సమావేశం..పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్…లక్షమందికి ఏర్పట్లు చేసిన జనసేన నేతలు
* విశాఖ కేంద్రంగా జరుగనున్న జీ-20 సదస్సుల సన్నాసక సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం జగన్..ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
*నేడు ఏపిఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకతిరుమలరావు జిల్లాకు రాక..రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా జరిగే ఆర్టీసీ డిస్పెన్షరీ నూతన భవన ప్రారంభోత్సవం
