* నేడు ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం. నెల్లూరుపాళెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
*నంద్యాల ప్యాపిలిలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రాంభించనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
*విశాఖపట్నంలోని సింహాచలంలో నేడు సింహాద్రి అప్పన్నకు స్వర్ణ సంపెంగ పుష్ప అర్చన
* నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల సందర్భంగా సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ పురస్కారం, పాల్గొననున్న నందమూరి దీపికా జానకీరాం, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్
* కర్నూలు నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవారికి పల్లకిసేవ
* విశాఖ అంబేద్కర్ భవన్ లో బౌద్ద మహా సదస్సు. హాజరుకానున్న బౌద్ద భిక్షువులు.
* విశాఖలో నేటితో 500రోజులకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటం. స్టీల్ ప్లాంట్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్న కార్మికులు. జీవీఎంసీ ఎదుట బహిరంగ సభ
* కొల్లాపూర్ లో మాజీమంత్రి జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. ఇవాళ చర్చకు సిద్ధం కావడంతో హై టెన్షన్ వాతావరణం.
* ఇవాళ్టి నుంచి ఇంద్రకీలాద్రి దగ్గర టొబాకో అమ్మకం, వినియోగంపై నిషేధం.
