ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,768 శాంపిల్స్ పరీక్షించగా.. 320 మందికి పాజిటివ్‌ గా తేలింది.. మరో 5 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 425 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2,97,45,537 కు పెరగగా… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,68,241 కు చేరింది. ఇప్పటి వరకు 20,50,386 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,397 కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,458 కు చేరుకున్నాయి.