Site icon NTV Telugu

New Year 2025: తిరుపతిలో కొత్త సంవత్సరం వేడుకలకు పోలీసుల ఆంక్షలు..

Frinking New Year

Frinking New Year

తిరుపతి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు పోలీసుల ఆంక్షలు, షరతులు విధించారు. నూతన సంవత్సర వేడుకల వేళ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబరు 31 రాత్రి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు నందు చెక్ పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాట్లు చేసి.. రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి, తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు. అలాగే.. వైన్ షాపులు, బార్‌లను ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత సమయంలో మూసివేయాలని అన్నారు. గరుడ వారధి, యూనివర్సిటీ ఫ్లై ఓవర్లను డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటలకు మూసివేయనున్నట్లు తెలిపారు.

Read Also: Tamil Nadu: బతికున్న 2447 తాబేళ్లను చాక్లెట్ బాక్స్‌ల్లో ఉంచి.. అక్రమ రవాణా(వీడియో)

తిరుపతి పట్టణంలో రోడ్లపై, ఫ్లై ఓవర్ పై నూతన సంవత్సర వేడుకలు నిషిద్ధమని ఎస్పీ తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో బ్రీత్ ఎనలైజర్లకు పట్టుబడిన వ్యక్తులను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు పంపడం జరుగుతుందని అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు, డిజే సౌండ్స్, రికార్డింగ్ డాన్సులు నిర్వహించేందుకు అనుమతులు లేవని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను సాకుగా చూపి బైక్‌లు, కార్లను రేసింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జనవరి, సంక్రాంతి పండుగ పర్వదినాల్లో జూదం, మట్కా, కోడి పందాలు, రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని.. నిర్వహిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు, చేయబడతాయన్నారు. అంతేకాకుండా.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి, ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని చెప్పారు. అలా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

Read Also: Koneru Hampi: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ కైవసం

Exit mobile version